Begin typing your search above and press return to search.

సస్పెన్స్ లో మహేష్ 27

By:  Tupaki Desk   |   3 Jun 2019 11:44 AM IST
సస్పెన్స్ లో మహేష్ 27
X
మహర్షి విజయాన్ని బాగా ఆస్వాదించిన మహేష్ బాబు ప్రస్తుతం విదేశాలలో రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. తన కొత్త సినిమా సరిలేరు నీకెవరు ఓపెనింగ్ కి ఈ కారణంగానే అందుబాటులో లేకపోయినా ప్రిన్స్ త్వరలోనే రెగ్యులర్ షూట్ లో జాయిన్ కాబోతున్నాడు. ఇది 26వ సినిమా. సాధారణంగా మహేష్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకోదాని గురించి ఆలోచించడు.

కానీ దీవి వల్ల ఏడాదికి ఒకటే చేయాల్సిన పరిస్థితి రావడంతో కొంత మార్పు తెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. తన 27త్ మూవీ కోసం ఇప్పటికే తీవ్ర సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. మొత్తం నలుగురికి మహేష్ చాలా పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. అందులో మొదటి పేరు పరశురామ్. రెండోది వంశీ పైడిపల్లి. మూడోది సందీప్ రెడ్డి వంగా. నాలుగోది సుకుమార్. త్రివిక్రమ్ పేరు కూడా ప్రచారంలో ఉంది కానీ ఆయన దగ్గర కథ రెడీగా లేదని మహేష్ కు తగ్గ స్టోరీ రెడీ అయితే తప్ప కలవనని ఈ మధ్య ఓ మీడియా ఫ్రెండ్ తో అన్నాడట.

ఇదిలా ఉంచితే మహేష్ ఈ నలుగురిలో ముందు ఎవరికి ఛాన్స్ ఇస్తాడు అనేదే అసలు ట్విస్ట్. బయట జరుగుతున్న ప్రచారం ఎలా ఉన్నా ఎవరైతే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో మెప్పిస్తారో వాళ్లకు గ్రీన్ సిగ్నల్ వెంటనే వచ్చేస్తుంది. కాకపోతే అది సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ పూర్తయ్యేలోపు ఒప్పించేలా ఉండాలి. పరశురామ్ ది ఓకే అయితే తన ఫ్రెండ్స్ ని నిర్మాతలుగా పరిచయం చేసే ప్లాన్ లో ఉన్నాడట దర్శకుడు కొరటాల శివ. మొత్తానికి మహేష్ 27 ఓ సస్పెన్స్ స్టోరీనే తలపిస్తోంది