Begin typing your search above and press return to search.

ఇంకా మహేష్ #25 టైటిల్ ఫిక్స్ కాలేదు

By:  Tupaki Desk   |   27 Oct 2017 7:37 AM GMT
ఇంకా మహేష్ #25 టైటిల్ ఫిక్స్ కాలేదు
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కేరీర్ లో ఎప్పుడు లేనంత భారీ ఫెయిల్యూర్స్ ని ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే చూశాడు. బ్రహ్మోత్సవం - స్పై డర్ సినిమాలతో వరుసగా నిరాశపరిచిన మహేష్ నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ తన స్టామినా చూపించాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అనే నేను సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రంపై మహేష్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలిసి ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక మహేష్ తన 25వ చిత్రాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. చాలా కథలు విన్న మహేష్ 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తియ్యాలని డిసైడ్ అయ్యాడు. కథ అన్ని వర్గాల ప్రేక్షాకులకు నచ్చేలా ఉందా లేదా అని ఆలోచించి మరి ఎంచుకున్నాడట. ఇక నిర్మాతలుగా దిల్ రాజు - అశ్వినిదత్ ఉన్నారు. దర్శకుడు కూడా సినిమాని చాలా రిచ్ గా తియ్యాలని ముందే విదేశాల్లో లొకేషన్స్ కోసం సెర్చ్ చేస్తున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. గత కొంత కాలంగా మహేష్ 25 సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. కృష్ణా ముకుందా మురారి - హరే రామా హరే కృష్ణ అని పలు రకాల టైటిల్స్ ఫిక్స్ చేసినట్లు అందరు అనుకుంటున్నారు. దీనిపై దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ విషయం పై ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇంకా ఏ టైటిల్ అనుకోలేదని చెబుతూ.. ఒకవేళ టైటిల్ ఫిక్స్ చేస్తే తప్పకుండా అందరికి తెలియజేస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.