Begin typing your search above and press return to search.

మహేష్‌ వస్తే కళ పెరుగుద్దంతే

By:  Tupaki Desk   |   12 April 2015 9:00 AM IST
మహేష్‌ వస్తే కళ పెరుగుద్దంతే
X
తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ప్రపంచంలోనే వెరీ పాపులర్‌. డాలర్లలో సంపాదించే తెలుగువారంతా ఇందులో సభ్యులు. ఎన్నారైల గుర్తింపుకు ఇదో వేదిక. తానా సెలబ్రేషన్స్‌ పేరుతో మహాసభలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికే 19సార్లు ఉత్సవాలు జరిగాయి. ఇది 20వ సారి. ఈ ఏడాది జూలైలో 2 నుంచి 4 వరకూ అంటే మూడు రోజుల పాటు తానా ఉత్సవాలు జరుగుతున్నాయి.

అయితే ఈ వేడుకల్లో ముఖ్య అతిధి ఎవరో ఊహించండి. ఇంకెవరు? టాలీవుడ్‌ క్రేజీ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. అతడు ఈ ఉత్సవాల్లో సందడి చేసేది కేవలం మూడు గంటలే అయినా తన కోసం బోలెడన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఇప్పటికే ఒప్పందం పూర్తయింది. నమ్రత శిరోధ్కర్‌ షెడ్యూల్‌ని ఖరారు చేశారు. అంతేకాదు ప్రిన్స్‌ అక్కడ అతిధిగా పాల్గొంటున్నందుకు గౌరవ వేతనంగా 1.5 కోట్లు అందుకుంటున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ ఫ్లయిట్‌ టికెట్‌ .. ఖరీదైన హోటల్‌ రూమ్‌ .. ఇవన్నీ వగైరా వగైరా అని తెలుస్తోంది.

ఏదేమైన ప్రిన్స్‌ రాక వల్ల తానా ఉత్సవాలకు కళ పెరుగుతుంది. తానా పేరుతో టిక్కెట్లకు గిరాకీ పెరుగుతుంది. ఇంకా రెండు నెలల టైమ్‌ ఉంది. ముందే మహేష్‌తో డేట్‌ ఫిక్సయింది కాబట్టి ఇక నుంచి తానాకి సంబరాలే సంబరాలు.