Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాధ్యతను టాలెంటెడ్ యాక్టర్ చేతిలో పెట్టిన మహేష్ అండ్ టీమ్...?
By: Tupaki Desk | 23 Sept 2020 2:20 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ''మేజర్'' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ ప్రొడక్షన్ హౌసెస్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ లో టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న 'మేజర్' షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ మధ్య గత ఆరు నెలలుగా ఆగిపోయిన 'మేజర్' చిత్రీకరణ తిరిగి ప్రారంభించారని సమాచారం.
కాగా, మహేష్ అండ్ టీమ్ ''మేజర్'' ప్రాజెక్ట్ బాధ్యతను పూర్తిగా హీరో అడవి శేష్ కి అప్పగించినట్లు చిత్ర వర్గాలు అంటున్నారు. మల్టీ టాలెంటెడ్ అయిన అడవి శేష్ కి కథ - స్క్రీన్ ప్లే తో పాటు సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ మీద మంచి అవగాహన ఉంటుందనే విషయం తెలిసిందే. ఆయన నటించిన గత చిత్రాల విషయంలో కూడా ఎక్సట్రా కేర్ తీసుకొని సక్సెస్ బాట పట్టించాడు. అందుకే మహేష్ అండ్ టీమ్ ఈ సినిమా విషయంలో హీరో మరియు డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇచ్చేశారని తెలుస్తోంది. అందుకే స్క్రిప్ట్ లో మహేష్ చెప్పిన చేంజెస్ ని కూడా అడవి శేష్ సున్నితంగా తిరస్కరించాడట. అయినప్పటికీ శేష్ చేతిలో ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత బెంగ ఎందుకు అన్నట్లు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ టీమ్ వ్యవహరిస్తోందట. మహేష్ - నమ్రత ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని తీసుకున్న శేష్ ఈ ప్రాజెక్ట్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడట. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారని సమాచారం.