Begin typing your search above and press return to search.

అల్లరోడు సూపర్ స్టార్ ఫ్రెండ్ అవుతాడట

By:  Tupaki Desk   |   11 April 2018 5:28 PM GMT
అల్లరోడు సూపర్ స్టార్ ఫ్రెండ్ అవుతాడట
X
కథ డిమాండ్ చేస్తే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా అందులో ఎదో ఒక పాత్ర డామినేట్ చేసే విధంగా ఉంటుంది. దర్శకుడే చాలా జాగ్రత్తగా హీరో ఇమేజ్ తగ్గకుండా ప్రధాన పాత్ర రేంజ్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా అదే పనిలో ఉన్నాడు. కథ మొత్తం ఫినిష్ చేసుకున్నప్పటికీ కథానాయకుడి పాత్ర పక్కన ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్ విషయంలో వంశీ ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ తిరిగేస్తున్నాడట.

ఇంతకు ఆ కథానాయకుడు అతని స్నేహితుడు ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మహేష్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. గత ఏడాది ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి అడిగినప్పటికీ నరేష్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఫైనల్ గా ప్రస్తుతం తెలుస్తోన్న సమాచారం ఏంటంటే అల్లరోడు మహేష్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు.

ఎక్కువగా అమెరికాలో జరిగే ఈ కథలో ఎప్పుడు కనిపించని లొకేషన్స్ దర్శనమిస్తాయట. గతంలోనే వంశీ పైడిపల్లి లొకేషన్స్ కోసం అమెరికాను జల్లెడ పట్టాడు. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. పూజ హెగ్డే ఈ సినిమాలో మహేష్ కు జోడిగా కనిపిస్తుండగా అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే అల్లరి నరేష్ లవర్ గా నటించనుంది.