Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: హ్యాపీ 15 మై లవ్ అంటున్న మహేష్
By: Tupaki Desk | 10 Feb 2020 2:10 PM ISTటాలీవుడ్ లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించే జంటలు చాలానే ఉన్నాయి. అలాంటి జంటలలో మహేష్ బాబు-నమ్రత జంట ఒకటి. ఈ రోజు మహేష్ - నమ్రతలు తమ 15 వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బ్యూటిఫుల్ ఫోటో పోస్ట్ చేసి "హ్యాపీ 15 మై లవ్. ప్రతి రోజూ నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాను @నమ్రత" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ కు నమ్రత "హ్యాపీ యానివర్సరీ" అంటూ రిప్లయ్ ఇచ్చారు.
ఫోటోలో మహేష్ పూర్తిగా నవ్వుల్లో మునిగిపోయి ఉంటే నమ్రత వెనుక నుంచి చేతులు వేసి ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చారు. మహేష్ కు జోడీగా 'వంశీ' సినిమాలో నమ్రత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. 2005 లో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత నమ్రత నటనకు దూరంగా ఉంటూకుటుంబం కోసం సమయం కేటాయిస్తున్నారు. తన విజయాలకు నమ్రత అందించే మద్దతే కారణమని మహేష్ గతంలో ఇంటర్వ్యూలలో చెప్పారు. యానివర్సరీ సంగతి తెలిసిన అభిమానులు మహేష్-నమ్రతలకు హ్యపీ యానివర్సరీ మెసేజులు పెడుతున్నారు.
మహేష్ తన కుటుంబంతో ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.