Begin typing your search above and press return to search.

మహేష్‌, బన్నీలకు.. ఓంకార్‌ కావాలా?

By:  Tupaki Desk   |   10 April 2015 9:13 PM IST
మహేష్‌, బన్నీలకు.. ఓంకార్‌ కావాలా?
X
చివరకు స్టార్‌ రైటర్స్‌ కూడా ఇప్పుడు యాంకర్‌ ఓంకార్‌నే ఇమిటేట్‌ చేస్తున్నారంటే అది టూ మచ్‌. ఇకపోతే స్టార్‌ హీరోలు కూడా ఓంకార్‌తో నెట్టుకొస్తున్నారు. ఇది ఇంకా విడ్డూరం. పవర్‌ఫుల్‌ హీరోలైన మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌లు కూడా ఓంకార్‌తో కామెడీ చేయాలంటారా? అసలు సదరు యాంకర్‌ను ఆడియన్స్‌ను మర్చిపోయినా ఈ సినిమా వాళ్ళు మాత్రం మర్చిపోవట్లేదు.

అప్పుడెప్పుడో వచ్చిన ''ఆట'' గేమ్‌ షోస్‌తో ఓంకార్‌ తెగ పాపులర్‌ అయిపోయాడు. మనోడు మాట్లాడే విధానం, కంటెస్టంట్లు ఈయనగారి కాళ్ళ మీద పడటం, జడ్జ్‌స్‌ మాట్లాడే తీరు.. అన్నీ కాస్త 'ఓవర్‌'గా కొత్తగా ఉన్న మాట వాస్తవమే. అయితే దీన్ని పట్టుకొని ఏళ్ళతరబడి మనోళ్ళు సినిమాల్లో కామెడీ చేయడానికి వాడుకుంటూనే ఉన్నారు. ఆగడులో మహేష్‌ బాబు చేసిన క్విజ్‌ ప్రోగ్రాం ఎపిసోడ్‌ నుండి నిన్న విడుదలైన సన్‌ ఆఫ్‌ సత్యమూర్తిలో బన్నీ కూడా 'అంత బాగోదు' అంటూ ఓంకార్‌ను ఇమిటేట్‌ చేసినవారే. స్టార్‌ హీరోలకు ఈ ఓంకార్‌ పిచ్చేటండీ బాబూ?

నిజంగా దేవుడు కాకపోయినా, ఒక మనిషికి గుడికట్టేసి రోజూ పూజిస్తోంటే ఆటోమ్యాటిక్‌గా కొన్ని రోజులకు దేవుడు అయిపోతారు. ఆ టైపులో మనోళ్ళు జనాలు ఓంకార్‌ యాంకరింగ్‌ను మర్చిపోయినా కూడా వీళ్లు గుర్తు చేసీ చేసీ అతగాడేదో ఒక మైటీ స్టార్‌ అన్నట్లు అందలం ఎక్కిస్తున్నారు అంటున్నారు విమర్శకులు. అస్తమానం ఈ ఓంకార్‌ గోలెందుకు గురూ? ఆపితే బెటర్‌!!