Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కన్నార్పడు..ఎవరూ గెలవలేరు!!

By:  Tupaki Desk   |   22 May 2020 5:40 PM IST
సూపర్ స్టార్ కన్నార్పడు..ఎవరూ గెలవలేరు!!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచుగా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ పోస్ట్ చేస్తూ అభిమానులను సంతోషపెడుతూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం నమ్రత మహేష్ బాబు గౌతమ్ తో బ్లింక్ అండ్ యూ లూజ్ గేమ్ ఆడుతున్న ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానికి కొనసాగింపు అన్నట్టుగా తాజాగా నమ్రత మరో ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేశారు.

ఈ వీడియోకు "మహేష్ బాబు Vs గౌతమ్ తర్వాత నా వంతు... #బ్లింక్ అండ్ యూ లూజ్. ఎప్పటిలాగే మహేష్ గెలిచాడు. నిజానికి నేను ఈ గేమ్ లో దిట్టను కానీ ఈ అబ్బాయితో మాత్రం గెలవలేను!!" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ గేమ్ లోభాగంగా ఒకరి ఎదురుగా ఒకరు.. ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ ఉండాలి. ఎవ్వరు ముందు కళ్లు ఆర్పితే వారు ఓడిపోయినట్టు.. ఎవరు అలాగే తదేకంగా కన్నార్పకుండా చూస్తూ ఉంటే వారు గెలిచినట్టు. ఇక మహేష్ మొహంలోకి చూస్తూ అలా గెలవడం ఎలాంటివారికైనా సాధ్యం అవుతుందా? అందుకే నమ్రత కూడా ఈ గేమ్ లో ఒడిపోయింది.

మహేష్ సినిమాల విషయానికి వస్తే పరశురామ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. మే 31 న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ సినిమాకు పూజాకార్యక్రమాలు జరుపుతారని టాక్ ఉంది.


వీడియో కోసం క్లిక్ చేయండి