Begin typing your search above and press return to search.
సౌత్ లో మరో బాహుబలి షూరూ
By: Tupaki Desk | 4 Dec 2018 4:02 PM ISTసౌత్ సినిమాల కంటే బాలీవుడ్ సినిమాల మార్కెట్ చాలా పెద్దది, బాలీవుడ్ స్టార్స్ దేశ వ్యాప్తంగా క్రేజ్ ను కలిగి ఉంటారు కనుక భారీ బడ్జెట్ చిత్రాలు చేసినా వారు వెనక్కు రాబట్టగలరు. కాని సౌత్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తే నిర్మాతలు నెత్తిన గుడ్డేసుకోవాల్సిందే అనే టాక్ ఉండేది. కాని అదంతా గతం, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలు కలెక్షన్స్ రాబట్టలేక చేతులెత్తేస్తున్న నేపథ్యంలో సౌత్ భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతున్నాయి. బాలీవుడ్ సినిమాల వసూళ్లను కూడా సౌత్ సినిమాలు క్రాస్ చేస్తున్నాయి.
బాహుబలి సినిమా తర్వాత తెలుగు తో పాటు తమిళ, మలయాళంలో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. బాహుబలి రెండు పార్ట్ లకు దాదాపుగా 400 కోట్లు ఖర్చు చేసిన జక్కన్న భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత శంకర్ ‘2.ఓ’ చిత్రాన్ని ఏకంగా 550 కోట్లతో తెరకెక్కించాడు. 2.ఓ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మరో వైపు మలయాళంలో కూడా వెయ్యి కోట్ల మూవీ రూపొందుతోంది. ఈ సమయంలోనే తమిళంలో మరో భారీ చిత్రం మొదలైంది.
తమిళ స్టార్ హీరో విక్రమ్ ‘మహావీర్ కర్ణ’ చిత్రంను చేయబోతున్నాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఆ సినిమా రూపొందనున్నట్లుగా తమిళనాట ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం గురించి చాలా నెలల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో మహావీర్ కర్ణ ప్రకటనతోనే ఆగిపోయిందని అనుకున్నారు. కాని తాజాగా షూటింగ్ ప్రారంభం అయ్యిందంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ముందు ముందు మరిన్ని భారీ సినిమాలు సౌత్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ విషయంలో బాలీవుడ్ ను సౌత్ సినిమాలు తలదన్నెలా వస్తుండటం సౌత్ ఇండియన్ సినీ అభిమానులు గర్వించ దగ్గ విషయం.