Begin typing your search above and press return to search.

స‌డెన్ గా ప్రేయ‌సిని పెళ్లాడి షాకిచ్చిన హీరో

By:  Tupaki Desk   |   2 Feb 2020 4:25 AM GMT
స‌డెన్ గా ప్రేయ‌సిని పెళ్లాడి షాకిచ్చిన హీరో
X
`బ్యాక్ బెంచ్ స్టూడెంట్` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రియితెడైన త‌మిళ న‌టుడు మ‌హ‌త్ రాఘ‌వేంద్ర. మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన ఆ సినిమా యావ‌రేజ్ గా ఆడింది అటుపై.. బ‌న్నీ వ‌ర్సెస్ చెర్రీ.. లేడీస్ అండ్ జెంటిల్మ‌న్..ర‌న్..సైకిల్ లాంటి చిత్రాల్లో న‌టించినా అంత‌గా గుర్తింపు రాలేదు. త‌మిళ అనువాదం గ్యాంబ్ల‌ర్ లో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించి మెప్పించాడు మ‌హత్. అయినా తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలేవీ రాలేదు. దీంతో మ‌హ‌త్ త‌మిళ సినిమాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం కోలీవుడ్ చిత్రాల‌తోనే బిజీగా ఉన్నాడు. తాజాగా మ‌హ‌త్ త‌న‌ ప్రేయ‌సిని స‌డెన్ గా వివాహం చేసుకుని ఓ ఇంటివాడు అయ్యాడు.

గ‌తేడాది ప్రాచీ మిత్రాతో ఎంగేజ్ మెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నారు. ఈ జంట‌ పెళ్లికి పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో గ‌తేడాది ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేసారు. ఈ శ‌నివారం త‌మిళ‌నాడులోని ఓ బీచ్ స‌మీపంలోని హిందు సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి జ‌రిగింది. పెళ్లి కేవ‌లం కుటుంబ స‌భ్యులు.. స‌న్నిహితులు..స్నేహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. కోలీవుడ్ నుంచి శింబు- అనిరుధ్ గెస్టుల్లో ఉన్నారు.

ప్ర‌స్తుతం మ‌హ‌త్ రాఘ‌వేంద్ర‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. నెటి జ‌నులు ఈ న‌వ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లతో ఆశీర్వ‌దించారు. అలాగే తెలుగులో న‌టుడిగా ప‌రిచ‌యం చేసిన మ‌ధురా శ్రీధ‌ర్ త‌న హీరోకి...ప్రాచీకి ప్ర‌త్యేకంగా విషెస్ తెలిపారు. మ‌హ‌త్ రాఘ‌వేంద్ర త‌మిళ బిగ్ బాస్ సీజ‌న్-3లో కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. సినిమాలు క‌న్నా బిగ్ బాస్ మ‌హ‌త్ కి మంచి పాపులారిటీ తీసుకొచ్చింది. ఆ క్ర‌మంలోనే బుల్లితెర ఆడియెన్ లో అభిమానులు సైతం సోష‌ల్ మీడియాల్లో మ‌హ‌త్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు.