Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్‌ లుక్: 'మ‌హాస‌ముద్రం'లో గూని బాబ్జీగా వర్సటైల్ యాక్టర్..!

By:  Tupaki Desk   |   25 May 2021 10:06 AM GMT
ఫ‌స్ట్‌ లుక్: మ‌హాస‌ముద్రంలో గూని బాబ్జీగా వర్సటైల్ యాక్టర్..!
X
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్.. ప్రస్తుతం ''మహా సముద్రం'' సినిమాలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ చిత్రం నుండి రావు ర‌మేష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని చిత్ర యూనిట్‌ విడుద‌ల చేసింది. ఇందులో గూని బాబ్జీగా రావు ర‌మేష్, ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు వెల్లడించారు. ఈ పోస్టర్ లో రావు రమేష్ టక్ చేసుకొని కోపంగా చూస్తున్నాడు. పేరుకు తగ్గట్టే ఆయన గూని తో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటే రావు రమేష్ మరోసారి ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్‌ కి త‌న‌దైన న‌ట‌న‌తో పూర్తి న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు.

'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి ''మహా సముద్రం'' చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ యాక్టర్స్ శర్వానంద్ - 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు ఫీమేల్ లీడ్ రోల్స్‌ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన శ‌ర్వా - సిద్దార్ధ్‌ - అదితి - అనూ ఇమాన్యూయేల్ - జ‌గ‌ప‌తిబాబు ఫస్ట్ లుక్స్‌ కి మంచి స్పందన వ‌చ్చింది. ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అజ‌య్ సుంక‌ర‌ కో- ప్రొడ్యూస‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు.

'మహా సముద్రం' చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫర్ గా.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైన‌ర్‌ గా వ‌ర్క్ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.