Begin typing your search above and press return to search.
అప్పుడే మహర్షిని వాడేస్తున్నారుగా
By: Tupaki Desk | 7 May 2019 4:54 PM ISTటీవీ ఛానెల్స్ వినోదంలో మహిళలను టార్గెట్ చేస్తూ సీరియల్స్ చేసే రచ్చ రోజూ చూసేదే. విపరీతమైన డ్రామాతో కుట్రలు కుతంత్రాలతో వేలకు వేలు ఎపిసోడ్లతో ఇవి చేసే అరాచకం గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. గత కొంత కాలంగా వీటికి సంగీతం అందించే దర్శకులు విచ్చిలవిడిగా తెలుగు బ్లాక్ బస్టర్స్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని పాటలను వాడేసుకుంటూ హ్యాపీగా పబ్బం గడుపుకుంటున్నారు.
ఇది ప్రశ్నించేందుకు ఎవరికీ టైం లేకపోవడంతో ఎవరికి వారే ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఇంకా రెచ్చిపోతున్నారు. ఇది ఎంత పీక్స్ కు చేరిందంటే ఆఖరికి మహర్షిలో సాంగ్స్ ని కూడా వాడేంత. ఇటీవలే ఓ ఛానల్ లో ప్రసారమైన సీరియల్ లో మహర్షిలోని ఇదే కదా నీ కథ పాటను శుభ్రంగా వాడేసుకున్నారు. బయట నుంచి విన్న వాళ్ళు టీవీలో దానికి సంబంధించిన ప్రోమో వస్తోంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్ కి దీన్ని సింక్ చేసి పారేశారు.
హక్కులు సదరు మ్యూజిక్ కంపెనీ వద్ద లేదా నిర్మాతల వద్ద అనుమతి తీసుకుని చేశారో లేదో కానీ మొత్తానికి ఈ వాడకం రోజురోజుకి పీక్స్ కి చేరిపోతోంది. ఆ మధ్య ఇళయరాజా గారు తన పాటలను పబ్లిక్ స్టేజి మీద పాడకూడదు అని బాలు గారికి లీగల్ నోటీసు పంపెదాక వెళ్ళింది వ్యవహారం. ఇక్కడ చూస్తేనేమో వారు వీరు అనే తేడా లేకుండా కొందరు టీవీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరివి లేపెస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొని వీటి సంగతి చూడాలని కోరుతున్నారు తెలుగు సినిమా సంగీత ప్రేమికులు.