Begin typing your search above and press return to search.

మహర్షి’ టీం అలెర్ట్

By:  Tupaki Desk   |   26 Dec 2018 5:30 PM GMT
మహర్షి’ టీం అలెర్ట్
X
ఈ మధ్య తెలుగు సినిమాల్ని లీకుల బెడద వెంటాడుతోంది. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన పెద్ద సినిమాలకు సంబంధించి కంటెంట్ తరచుగా లీక్ అయిపోతోంది. సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే దృశ్యాలు బయటికి వచ్చేస్తున్నాయి. ‘అరవింద సమేత’ టీం ఈ విషయంలో ఎంత ఇబ్బంది పడిందో తెలిసిందే. ‘గీత గోవిందం’.. సినిమా నుంచి కూడా కొన్ని కీలకమైన సన్నివేశాలు లీక్ అయ్యాయి. ‘ట్యాక్సీవాలా’ అయితే సినిమా సినిమా బయటికి వచ్చేసింది. ఐతే వాటి ప్రభావం సినిమాల మీద పెద్దగా పడలేదు. తాజాగా మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న క్రేజీ మూవీ ‘మహర్షి’కి కూడా ఈ లీక్ బెడద తప్పలేదని సమాచారం. ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ బిట్ ఆన్ లైన్లోకి వచ్చేసినట్లు సమాచారం. అది ఎలా బయటికి వచ్చిందో తెలియదు మరి.

వెంటనే అలెర్ట్ అయిన చిత్ర బృందం.. ఆన్ లైన్ నుంచి ఆ పాటను తీయించే ప్రయత్నంలో పడిందట. ముందుగా మేల్కోవడం మంచే చేసిందని.. అది వైరల్ కాకుండా అడ్డుకోగలిగారని అంటున్నారు. ఈ పరిణామం చిత్ర బృందాన్ని బాగానే అలెర్ట్ చేసిందట. యూనిట్లోని అందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. సెల్ ఫోన్లపై నిషేధం విధించారట. ఎడిటింగ్ రూంలో భద్రత పెంచారట. ఇక పై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారట. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో విలేజ్ సెట్లో షెడ్యూల్ పూర్తయింది. ఇంకో షెడ్యూల్లో టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం. తర్వాత పోస్ట్ ప్రొడక్షణ్ మొదలు పెట్టి అనుకున్న ప్రకారమే ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు.. అశ్వినీదత్.. పీవీపీ కలిసి నిర్మిస్తున్నారు.