Begin typing your search above and press return to search.

'మహర్షి' వాయిదాతో ఆ సినిమాలు రీ షెడ్యూల్‌

By:  Tupaki Desk   |   23 Feb 2019 11:00 PM IST
మహర్షి వాయిదాతో ఆ సినిమాలు రీ షెడ్యూల్‌
X
మహేష్‌ బాబు 25వ చిత్రం 'మహర్షి' ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సినిమాకు రీ షూట్‌ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. గత రెండు మూడు రోజులుగా మీడియాలో మహర్షి విడుదల వాయిదా అంటూ వస్తున్న వార్తలపై యూనిట్‌ సభ్యులు స్పందించక పోవడంతో వాయిదా నిజమే అయ్యి ఉంటుందనే అభిప్రాయం బటపడింది. ఈ సమయంలోనే మహర్షి సినిమా కారణంగా ఇతర సినిమాలు రీ షెడ్యూల్‌ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా జెర్సీ మూవీని ఏప్రిల్‌ మొదటి లేదా రెండవ వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే మహర్షి తో పోటీ లేదు కనుక ఏప్రిల్‌ 19 లేదా 25న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక 'కాంచన 3' చిత్రం ఏప్రిల్‌ రెండవ లేదా మూడవ వారంలో విడుదల అయితే 'చిత్రలహరి' చిత్రంను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చిత్రలహరి చిత్రాన్ని ఏప్రిల్‌ 12వ తేదీన విడుదల చేయాలని మొదటి నుండి భావిస్తున్నారు. కాని మహర్షి విడుదల వాయిదా నేపథ్యంలో చిత్రలహరి రీ షెడ్యూల్‌ అయ్యే అవకాశం ఉంది.

మహర్షి చిత్రం విడుదల తేదీ ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే జెర్సీ, చిత్రలహరి, మజిలీ చిత్రాల షెడ్యూల్‌ చేశారు. మహర్షి చిత్రం ఇప్పటికే పలు సార్లు వాయిదాలు పడ్డ నేపథ్యంలో ఫ్యాన్స్‌ లో అసహనం వ్యక్తం అవుతుంది. అయితే ఇతర సినిమాల హీరోలు మాత్రం ఇదే మంచి సమయంగా భావించి తమ సినిమాలను రీ షెడ్యూల్‌ చేసుకుంటున్నారు. మహర్షి మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.