Begin typing your search above and press return to search.

మహర్షి ఖాతాలో మరో రికార్డు?

By:  Tupaki Desk   |   9 Jun 2019 11:22 AM IST
మహర్షి ఖాతాలో మరో రికార్డు?
X
ప్రిన్స్ మహేష్ బాబుకు చాలా ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయిన మహర్షి ఫైనల్ రన్ కు దగ్గరపడే కొద్దీ యాభై రోజుల దాకా దీని మొమెంటమ్ ను కంటిన్యూ చేసేందుకు యూనిట్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మొన్న వదిలిన నూటా డెబ్బై ఐదు కోట్ల పోస్టర్ దిల్ రాజు చేసిన వంద కోట్ల షేర్ ప్రకటన ఇవన్నీ అందులో భాగమే. నిజంగా మహర్షి చరిత్ర తిరగరాసేంత ఇండస్ట్రీ సక్సెస్ అందుకుందా అంటే అవునని వెంటనే చెప్పలేని పరిస్థితి.

మే నుంచి చాలా డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కి అంతో ఇంతో హుషారు కలిగించింది మాత్రం ముమ్మాటికీ మహర్షే. దీన్నే హై లైట్ చేస్తూ టీమ్ ఇప్పుడు కొత్త ప్రకటన చేసింది. దాని ప్రకారం గత నాలుగు వారాంతాల్లో నేషనల్ మల్టీ ప్లెక్సుల్లో అత్యధిక ఆక్యుపెన్సీ వచ్చిన సినిమా మహర్షినేనట. సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఇది పూర్తిగా అబద్దమని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే నిజంగానే మహర్షి వీకెండ్స్ లో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాడు.

ఏ సెంటర్స్ లో మరీ ముఖ్యంగా సిటీస్ లో దాదాపు ఫుల్స్ పడుతున్నాయి. కానీ మిగిలిన కేంద్రాల్లో మాత్రం మూడో వారం నుంచే డ్రాప్ మొదలైన మాటా వాస్తవం. కానీ కేవలం వీకెండ్ లో వస్తున్న వసూళ్లను మాత్రమే హై లైట్ చేయడంలో పరమార్థం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆలా అని శని ఆదివారాలు టికెట్లు దొరకని పరిస్థితి అయితే లేదు. సులభంగానే అందుతున్నాయి. కాకపోతే మే 9 తర్వాత వచ్చిన ఏ సినిమా యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది కాబట్టి మహర్షికి ఇది సాధ్యమయింది. స్ట్రాంగ్ అపోజిషన్ ఒక్కటున్నా ఇబ్బందులు తప్పేవి కావేమో