Begin typing your search above and press return to search.

మహర్షి లక్ష్యం చేరుకోగలడా?

By:  Tupaki Desk   |   19 May 2019 11:41 AM IST
మహర్షి లక్ష్యం చేరుకోగలడా?
X
మహేష్ 25వ సినిమాగా ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని అభిమానులు ఎంతో ఆశించిన మహర్షి ఇంకా రెండో వారంలోనే ఉంది. ఫైనల్ స్టేటస్ తేలడానికి కొంత టైం పడుతుంది. ఒకపక్క టీం మొదటి రోజు నుంచి నిన్నటి దాకా రెస్ట్ లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో ఏదో ఒక ప్రమోషన్ ని ఓ రేంజ్ హంగామాతో చేస్తూనే ఉన్నారు. హీరోతో సహా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు మహర్షిని మించిన సినిమా కెరీర్ లోనే లేదు అనే తరహాలో చెప్పడం సోషల్ మీడియాలో సైతం చర్చగా మారింది.

అయితే నిజంగా మహర్షి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ సునామిలో మునిగి తేలుతోందా అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకడం లేదు. కారణం కొన్ని చోట్ల నష్టాలు తేవడం ఖాయమనే మాట బలంగా వినిపించడమే. గట్టిగా అరిచి చెబితే అబద్దం నిజమని నమ్మొచ్చు కానీ సినిమా పరిశ్రమకు ఈ సూత్రం వర్తించదు. ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎంత అతికినట్టు చెప్పినా తర్వాతయినా నిజాలు బయట పడతాయి

మహర్షి బాగా ఆడుతోంది. అందులో సందేహం లేదు. అయితే ప్రేక్షకులు యూనిట్ చెబుతున్నట్టుగా యునానిమస్ గా దీనికి బ్రహ్మరధం పడుతున్నారు అనుకుందాం. అలాంటప్పుడు ఏరియాలతో సంబంధం లేకుండా ప్రతి చోటా వసూళ్లు హోరెత్తిపోవాలి. ఒక్కడు-పోకిరి- శ్రీమంతుడు లాంటి సినిమాల విషయంలో జరిగింది అదే. ఓవర్సీస్ మొదలుకుని చిన్న సి సెంటర్ దాకా ప్రతి బయ్యర్ లాభపడ్డాడు. సినిమా చూసిన జనం మౌత్ పబ్లిసిటీతోనే నిలబెట్టారు.

కాని మహర్షి ఈ విషయంలో కొంత డివైడ్ టాక్ ను ఎదురుకుంటున్న మాట వాస్తవం. గత సినిమాల ఛాయలు మూడు గంటల నిడివి ఎమోషన్ విషయంలో కొన్ని ఎపిసోడ్స్ తప్ప సినిమా అంతా క్యారీ చేయలేకపోవడం రిపీట్ పబ్లిక్ రాకుండా చేశాయి. లేదంటే సీన్ వేరుగా ఉండేది. పది రోజుల దాటకుండానే ఇంత చర్చకు దారి తీస్తున్న మహర్షి ఫలితం ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు అమాంతం వేగం పెంచుకుని లాభాలను చూపించాలి. ఇంకా లాంగ్ జర్నీ బాలన్స్ ఉన్న నేపధ్యంలో మహర్షి ఎంత వరకు నెగ్గుకు వస్తాడో వేచి చూడాలి