Begin typing your search above and press return to search.

సమ్మర్ లో వస్తున్న మాస్ మహారాజా 'ఖిలాడి'

By:  Tupaki Desk   |   30 Jan 2021 11:48 AM GMT
సమ్మర్ లో వస్తున్న మాస్ మహారాజా ఖిలాడి
X
'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్రస్తుతం 'ఖిలాడి' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. 'రాక్షసుడు' ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ అధినేత జయంతి లాల్‌ గడ సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ర‌వితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌధ‌రి - డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవల రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా 'ఖిలాడీ' సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది.

సమ్మర్ కానుకగా 'ఖిలాడి' చిత్రాన్ని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ అనౌన్సమెంట్ పోస్టర్ ని కూడా వదిలారు. ఇందులో రవితేజ చేతిలోకల్ గన్ పట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ చిత్రం కోసం నాలుగు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మరియు అన్బు-అరివు యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారు.

రమేష్ వర్మ హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్‌ మ్యూజిక్ సమకూరుస్తుండగా.. శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. 'లూసిఫ‌ర్' సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్‌ ఈ సినిమా కోసం ప‌నిచేస్తున్నారు. శ్రీ‌కాంత్ విస్సా - దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ కలసి డైలాగ్స్ రాస్తున్నారు. 'ఖిలాడి' సినిమా ఈ వేసవిలో కచ్చితంగా ప్రేక్షకులకు అలరిస్తుందని మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.