Begin typing your search above and press return to search.

మహానాయకుడు అక్కినేని మజ్నుమీద పడ్డాడే!

By:  Tupaki Desk   |   6 Oct 2018 8:23 AM GMT
మహానాయకుడు అక్కినేని మజ్నుమీద పడ్డాడే!
X
ఈ రిలీజ్ డేట్లున్నాయే అవి హిట్ల ను ఫ్లాపులుగా.. ఫ్లాపులను యావరేజీ సినిమాలుగా మార్చగలిగే సత్తా ఉన్నవి. అందుకే అల్లు అరవింద్ దిల్ రాజు లాంటి సీనియర్లు రిలీజ్ డేట్లను ఆచితూచి ఎంపిక చేస్తారు. ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నంత మాత్రాన సేఫ్ అయినట్టు కాదు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో శైలజా రెడ్డి అల్లుడు యూ టర్న్ తీసుకున్నట్టు ఉంటుంది పరిస్థితి.

అంతటితో ఆగవు.. 'ఎన్టీఆర్' నుండి మహానాయకుడు ఊడి 'Mr.మజ్ను' నెత్తిన పడొచ్చు..! అర్థం కాలేదా. అక్కినేని చినబాబు అఖిల్ తాజా చిత్రం 'Mr. మజ్ను' ను మొదట డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారట. కానీ ఇప్పటికే డిసెంబర్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా రిలీజులు ఉన్నాయి. దీంతో 'Mr. మజ్ను' ను రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారట. కానీ ఇప్పుడు క్రిష్ ఎన్టీఆర్ ను రెండు భాగాలు చేసి మొదటి భాగం 'కథానాయకుడు' జనవరి 9 న.. రెండో భాగం 'మహానాయకుడు' జనవరి 24 న విడుదల చేయాలని నిర్ణయించడంతో అక్కినేని వారి సినిమాకు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది.

అఖిల్ ఇప్పటికే రెండు ఫ్లాప్ సినిమాలతో డీలా పడి ఉన్నాడు. ఈ సినిమావిజయం తన కెరీర్ కు చాలా కీలకం.. ఇలాంటి పరిస్థితిలో 'మహానాయకుడు' సినిమా తో పోటీ ఏమాత్రం మంచిది కాదు. మరి ఈ పోటీ విషయంలో 'Mr. మజ్ను' నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.