Begin typing your search above and press return to search.

మహానటితో శ్రీనివాసుడు ?

By:  Tupaki Desk   |   3 Jun 2019 2:26 PM IST
మహానటితో శ్రీనివాసుడు ?
X
గత ఫలితాలను విశ్లేషించుకుంటూ కొంత గ్యాప్ తీసుకున్న హీరో నితిన్ వరస ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నాడు. ఇంకో రెండు నెలలు ఆగితే శ్రీనివాస కళ్యాణం వచ్చి ఏడాది అవుతుంది. ఇంకా కొత్త సినిమా మొదలుకానే లేదు. ఛలోతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకీ కుడుములు నితిన్ కోసం భీష్మ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. రష్మిక మందన్న హీరొయిన్.

థీమ్ ని ప్రెజెంట్ చేస్తూ ఆ మధ్య ఓ రెండు పోస్టర్లు వదిలారు తప్ప రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అనేదాని మీద ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ నెలలోనే సెట్స్ లోకి అడుగు పెట్టనుంది. రేపో మాపో ప్రకటన రావొచ్చు. ఆపై వరస షెడ్యూల్స్ లో వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోందట

ఇక దీంతో పాటు తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో ఓ సినిమా చేయనున్నాడు నితిన్. ఇందులో కీర్తి సురేష్ ఓకే అయినట్టుగా ఇన్ సైడ్ టాక్. మహానటి తర్వాత తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేయడం తగ్గించేసిన కీర్తి సురేష్ పూర్తిగా స్టార్ హీరోలతో చేస్తూ కోలీవుడ్ కు అంకితమైపోయింది. వెంకీ అట్లూరి చెప్పిన లైన్ నచ్చడంతో నితిన్ తో చేసేందుకు ఓకే చెప్పినట్టుగా వినికిడి.

అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే దాకా చెప్పలేం కానీ చర్చలైతే జరిగాయట. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ పడితే ఇది కూడా త్వరలోనే పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది. అన్ని కలిసి వస్తే ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రావొచ్చు. భీష్మ అయితే పక్కా. ఇప్పుడు మిస్ అయినా వెంకీ అట్లూరిది వచ్చే సంవత్సరం ప్రారంభంలో రావొచ్చు.