Begin typing your search above and press return to search.

'మహానటి' మూడవ ప్రయత్నం

By:  Tupaki Desk   |   6 Jun 2021 7:30 AM GMT
మహానటి మూడవ ప్రయత్నం
X
మహానటి తో సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్ గా మారిపోయిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ఒక వైపు కమర్షియల్‌ హీరోయిన్‌ గా స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటిస్తూ ఉంది. ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీస్ పెంగ్విన్‌ మరియు మిస్ ఇండియా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు ఓటీటీ ద్వారా విడుదల అయ్యి నిరాశ పర్చాయి. కీర్తి సురేష్‌ మరో మూవీ 'గుడ్‌ లక్ సఖి' విడుదలకు సిద్దం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా గత ఏడాది నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.

గుడ్‌ లక్‌ సఖి సినిమా ను కూడా జీ5 ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఓటీటీ వారితో చర్చలు జరుపుతున్నారని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈవిషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ని రోజులు థియేటర్ రిలీజ్ కు వెయిట్‌ చేసిన మేకర్స్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎప్పటి వరకు ఉంటుందో అనే ఉద్దేశ్యంతో మరీ ఆలస్యం చేయకుండా ఓటీటీ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీలో ఒక వర్గం వారు అంటున్నారు.

ఇప్పటికే ఓటీటీ ద్వారా విడుదల అయిన పెంగ్విన్‌.. మిస్ ఇండియా సినిమా లు నిరాశ పర్చాయి. ముఖ్యంగా మిస్ ఇండియా సినిమా దారుణంగా పరాభవంను చవిచూసింది. కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్‌ సఖి సినిమా ఫలితంపై అప్పుడే కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీ రిలీజ్ అంటూ ప్రచారం మొదలయిన నేపథ్యంలో ఆమెకు కలిసి రాని ఆ ప్రయత్నం మళ్లీ ఎందుకు అంటూ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మిస్ ఇండియా తరహాలోనే గుడ్‌ లక్ సఖి సినిమా కూడా ఓటీటీ లో విడుదల అయితే ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓటీటీ రిలీజ్ పై స్పష్టత రాలేదు. అభిమానులు ఇప్పటి నుండే ఈ విషయమై హడావుడి అక్కర్లేదు అంటూ నెటిజన్స్ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.