Begin typing your search above and press return to search.

మహానటి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తోందట

By:  Tupaki Desk   |   5 Dec 2017 12:35 PM GMT
మహానటి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తోందట
X
కళ్లతో నవ్వే గుణం చాలా తక్కువమందికి ఉంటుంది. సినిమాల్లో అయినా వ్యక్తిగత జీవితంలో ఆయినా అదే విధంగా నవ్వే అందాల రాశి సావిత్రి. తన సినిమాలతో ఎందరినో ఆకట్టుకున్న ఆమె జీవితం ముగింపులో చాలా కష్టాలను అనుభవించారు. ప్రశ్నార్థకంగా ముగిసిన ఆమె జీవితానికి మహానటి అనే సినిమా ఒక సమాధానం కావాలని యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

మొదటి సారి ఒక అందమైన తెలుగు నటి జీవితం తెరపై చూడబోతున్నాం. మహానటి సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశలో ఉంది. ఆ సినిమా కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ లో కూడా సినిమా రిలీజ్ కానుంది. అయితే సినిమా పాత్రల గురించి చాలా రూమర్స్ వస్తున్నా కూడా దర్శకుడు అధికారికంగా ఏ విషయాన్నీ తెలుపడం లేదు. అయితే రేపు సడన్ సప్రైజ్ ని మాత్రం ప్లాన్ చేశాడు. టీజర్ లేదా ఫస్ట్ లుక్ భయటపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ ఏ మాత్రం క్లూ ఇవ్వలేదు.

సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక జమున పాత్రలో సమంత కనిపించనుంది. ఇక మరి కొంతమంది ప్రముఖు నటులతో పాటు లేటెస్ట్ దర్శకులు కూడా సినిమాలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. అలనాటి కథాంశం కావడంతో దర్శకుడు ఎక్కువగా సెట్స్ లలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సి.అశ్విని దత్ సినిమాను నిర్మిస్తున్నాడు.