Begin typing your search above and press return to search.

మహానటికి మహత్తరమైన ఆఫర్

By:  Tupaki Desk   |   29 Aug 2017 3:58 AM GMT
మహానటికి మహత్తరమైన ఆఫర్
X
మహానటి సావిత్రి జీవిత గాథతో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బయో పిక్ తీయడానికి సిద్ధపడినప్పటి నుంచి టాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుగా మారింది. ఏదో సాదాసీదా నటులతో కాకుండా ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ పేరున్న నటులే చేస్తుండటం ఈ ప్రాజెక్టుకు పైగా హైప్ తెచ్చింది. టైటిల్ రోల్ సావిత్రి పాత్రను యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ చేస్తుండగా... టాప్ హీరోయిన్ సమంత ఇంకో ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. దీంతో ఈ సినిమాకు స్టార్ వాల్యూ వచ్చేసింది.

మహానటి సినిమా షూటింగ్ ను ఫస్ట్ నుంచి సింపుల్ అండ్ సైలంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎంతనేది కచ్చితంగా బయటపెట్టకపోయినప్పటికీ భారీ తారాగణం కారణంగా ఖర్చు ఎక్కువే అవుతుందనేది తెలిసిన విషమయే. ఈటైంలో మహానటి టీం ను ఆనందంలో ముంచెత్తేలా ఈ సినిమా ఓవర్సీస్ రేట్లు బ్రహ్మాండంగా పలికాయి. నిర్వాణ సినిమాస్ ఈ రైట్స్ కోసం రూ. 4.5 కోట్ల వరకు ఆఫర్ చేసిందని ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. ఇప్పటికే ఆనందో బ్రహ్మ - అర్జున్ రెడ్డి సినిమాలు విడుదల చేసి భారీ లాభాలు కళ్లజూసిన నిర్వాణ సినిమా మొత్తానికి మహానటిపై ఓ రకంగా భారీ పందెమే కాసింది. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా ఓవర్సీస్ రైట్స్ కే ఇంతమొత్తం రావడం ఓ రకంగా రికార్డే.

సావిత్రి జీవితంలో ముఖ్యమైన జెమినీ గణేశన్ పాత్ర ను మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అయినా టాలీవుడ్ లో స్ట్రయిట్ ఫిలింలో నటించడం ఇదే మొదటిసారి. అర్జున్ రెడ్డి తో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ - ప్రకాష్ రాజ్ కూడా నటిస్తుండటం ఈ సినిమాకు మరో ఆకర్షణ. సో.. చూస్తుంటే మహానటి మూవీ రేంజి పెరుగుతూ వస్తోంది.