Begin typing your search above and press return to search.

మహానటి రేసులోంచి తప్పుకుంది

By:  Tupaki Desk   |   2 March 2018 6:15 AM GMT
మహానటి రేసులోంచి తప్పుకుంది
X
రామ్ చరణ్-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ సినిమా మార్చి 29కి షెడ్యూల్ అయిందని తెలిసి కూడా ‘మహానటి’ సినిమాను అదే తేదీకి షెడ్యూల్ చేసింది ఆ చిత్ర బృందం. దీని వల్ల ఆ చిత్రానికి ప్రచారం బాగానే లభించింది. ఐతే డేట్ అయితే ఇచ్చారు కానీ.. నిజంగానే ‘రంగస్థలం’కు పోటీగా దీన్ని దించుతారా అని చాలామంది సందేహించారు. ఇప్పుడు ఆ సందేహాలే నిజమయ్యాయి. ‘మహానటి’ రేసు నుంచి తప్పుకుంది. ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేయట్లేదు. ఈ చిత్రాన్ని వేసవి చివర్లో ప్రేక్షకుల ముందుకు తెస్తారట.

ముందు అనుకున్న తేదీకి ఇంకో నాలుగు వారాలు మాత్రమే సమయం మిగిలి ఉండగా.. ‘మహానటి’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా షూటింగే పూర్తి కాలేదంటే.. ఇక పోస్ట్ ప్రొడక్షన్.. ప్రమోషన్ కు చాలా సమయం వెచ్చించాల్సి ఉంది. అందుకే ‘మహానటి’ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. అశ్వినీదత్ అల్లుడు.. ‘ఎవడే సుబ్రమణ్యం’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న ఈ చిత్రంలో సమంత.. దుల్కర్ సల్మాన్.. షాలిని పాండే.. మోహన్ బాబు.. ప్రకాష్ రాజ్.. విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.