Begin typing your search above and press return to search.

అఫీషియల్: సావిత్రి సినిమా వస్తోంది

By:  Tupaki Desk   |   8 March 2017 8:17 AM GMT
అఫీషియల్: సావిత్రి సినిమా వస్తోంది
X
''తరాలను నిర్మించే స్ర్తీ జాతి కోసం.. తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ'' అని చెబుతూ.. ఇప్పుడు మహానటి సావత్రి పై ఒక బయోపిక్ తీస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించాడు. ఈరోజు ఉమెన్స్ డే సందర్బంగా మనోడు సినిమా గురించి చెబుతూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు.

మధ్యలో సావిత్రి.. అటువైపు కీర్తి సురేష్‌.. ఇటువైపు సమంత.. వింటేజ్ లుక్కులో పోస్టర్. బాగానే ఉంది. మొత్తానికి తెలుగులో ఇప్పటివరకు కేవలం కమర్షియల్ సినిమాలే వస్తున్న సమయంలో.. బాలీవుడ్ లో దంగల్ వంటి బయోపిక్ లు వస్తున్న సమయంలో.. ఇప్పుడు ఇక్కడ కూడా జీవిత కథలు ఆధారంగా సినిమాలు రావడం అనేదే హర్హించదగిన విషయమే. అందులోనూ సావిత్రిపై సినిమా తీస్తున్నందుకు మనం దర్శకుడితో పాటు.. ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ను కూడా అభినందించాల్సిందే.

ఇకపోతే ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్‌ నటిస్తుండగా.. ఆమె కథను మనకు నెరేట్ చేసే పాత్రను సమంత పోషిస్తోంది. ఇతర క్యాస్టింగ్ మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/