Begin typing your search above and press return to search.

ద్రౌపది పాత్రలో సీత.. చేస్తుందా?

By:  Tupaki Desk   |   7 July 2017 3:52 PM GMT
ద్రౌపది పాత్రలో సీత.. చేస్తుందా?
X
సౌత్ బ్యూటీ నయనతార ఎలాంటి పాత్రను అయినా చేసి మెప్పించడమే కాదు.. తనకు నచ్చితే మాత్రమే ఆ సినిమా చేసేందుకు సిద్ధపుడుతుంది. పిసరంత కూడా ప్రచారం చేయబోనని ముందే చెప్పి మరీ.. ఒప్పందం చేసుకుని సినిమాలు చేసే ఏకైక హీరోయిన్ నయనతార మాత్రమే.

టాలీవుడ్ లో అనేక కమర్షియల్.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో ఆకట్టుకున్న నయనతార.. నందమూరి బాలకృష్ణ తో కలిసి శ్రీరామ రాజ్యం చిత్రంలో సీతగా మెప్పించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడీ భామకు అలాంటిదే మరో అరుదైన అవకాశం తలుపుతట్టింది. శాండల్ వుడ్ లో పలువురు స్టార్స్ కలిసి నటిస్తున్న కురుక్షేత్ర చిత్రంలో ద్రౌపతి పాత్రను పోషించాలంటూ మేకర్స్ ఈమెను సంప్రదించారు. ధుర్యోధనుడిగా దర్శన్.. కర్ణుణుగా రవిచంద్రన్ నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్ అంబరీష్ భీష్ముడి పాత్రలో నటించనున్నాడు.

కన్నడ పరిశ్రమలోనే అత్యంత భారీగా కురుక్షేత్ర రూపొందుతుండగా ద్రౌపది పాత్ర చేయాల్సిందిగా నయన్ ను కోరారు మేకర్స్. అయితే.. ప్రస్తుతం తన బిజీ షెడ్యూల్ కారణంగా.. తనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా.. ఈ ప్రాజెక్టుకు సైన్ చేయడంపై నయనతార ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఈ చిత్రంలో నటించేందుకు నయనతార అంగీకరిస్తే.. రామాయణంలో సీత పాత్ర.. భారతంలో ద్రౌపది పాత్ర.. రెండింటినీ పోషించిన అరుదైన రికార్డు ఆమె ఖాతాలో జమవుతుంది.