Begin typing your search above and press return to search.

బేబీ లైఫ్ ఫార్ములా - లిరికల్ వీడియో

By:  Tupaki Desk   |   17 Jun 2019 10:33 AM IST
బేబీ లైఫ్ ఫార్ములా - లిరికల్ వీడియో
X
సమంతా టైటిల్ రోల్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ బేబీ ఆడియోలోని మూడో సింగల్ ఇందాకా విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం సమకూర్చగా గాయని నూతన మోహన్ స్వరాలాపనలో మిక్కీ జె మేయర్ దీనికి ట్యూన్ అందించారు. ఆద్యంతం జీవితాన్ని అందులో అనుభవవించాల్సిన పాజిటివ్ కోణాన్ని హై లైట్ చేస్తూ ఒద్దికైన పదాలతో అచ్చ తెలుగులో పూర్తి పాట ఇలాంటిది ఈ మధ్య రాలేదని చెప్పొచ్చు.

హీరోయిన్ పాత్ర తనలో లక్షణాలు చెప్పుకుంటూనే ఇంకొకరికి కూడా స్ఫూర్తిగా నిలిచేలా లైఫ్ లెసన్స్ ని నేర్పించిన తీరు బాగుంది. చుట్టపు చూపుగా వచ్చామందరం మూటకట్టుకుని పోయేదెవ్వరం ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా లాంటి అద్భుతమైన పద మాయాజాలం ఇందులో చక్కగా కుదిరింది మహా అద్భుతం అంటూ మొదలయ్యే ఈ లిరికల్ వీడియో మధ్యలో సమంతా పిక్స్ ని విజువల్స్ రూపంలో పొందుపరిచిన తీరు బాగుంది.

వాటిని బట్టి ఇది స్టేజి మీద సమంతా పాడే పాట అనే క్లారిటీ వచ్చేసింది. వచ్చిన మూడు పాటల్లో కూల్ మెలోడీగా ఇదే టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. మిక్కీ జె మేయర్ తనదైన శైలిలో కూల్ మెలోడీని ఇవ్వగా సిరివెన్నెల తరహాలో చిన్న పదాలతో గొప్ప అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన భాస్కరభట్లకు కూడా ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. వచ్చే నెల 5న విడుదల కాబోతున్న ఓ బేబీలో నాగ శౌర్య - లక్ష్మి - రాజేంద్ర ప్రసాద్ - రావు రమేష్ - తేజ ఇతర కీలక పాత్రలు పోషించారు.