Begin typing your search above and press return to search.

మరో వివాదంలో విజయ్‌ మూవీ

By:  Tupaki Desk   |   16 Nov 2018 12:41 PM GMT
మరో వివాదంలో విజయ్‌ మూవీ
X
తమిళ స్టార్‌ హీరో తన ప్రతి సినిమాతో ఏదో ఒక వివాదాన్ని మూట కట్టుకుంటూనే ఉన్నాడు. ఇటీవలే ‘సర్కార్‌’ చిత్రంతో విజయ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అన్నాడీఎంకే అధినేత్రి - మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి తప్పుగా చూపించారని - సినిమాలో ఆమెను విలన్‌ గా చూపించారంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దాంతో దర్శకుడు సర్కార్‌ మూవీ నుండి అందుకు సంబంధించిన సీన్స్‌ ను తొలగించడం జరిగింది.

సర్కార్‌ చిత్రంకు ముందు విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెర్సల్‌’ చిత్రం తీవ్ర వివాదానికి తెర లేపిన విషయం తెల్సిందే. దేశంలోని వైధ్యరంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంతో పాటు ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న అవినీతిని దర్శకుడు మెర్షల్‌ ఘాటుగానే ఆ చిత్రంలో చూపించడం జరిగింది. దాంతో బీజేపీ నాయకులు ఆ చిత్రంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. ఎంత ఆందోళనలు వచ్చినా కూడా ‘మెర్షల్‌’ చిత్రం విజయ్‌ కెరీర్‌ బెస్ట్‌ మూవీగా నిలిచింది. ఇప్పుడు మరోసారి మెర్షల్‌ చిత్రం వివాదంలో నిలిచింది.

‘మెర్షల్‌’ చిత్రంలో విజయ్‌ ఒక మెజీషియన్‌ పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. మెజీషియన్‌ గా ట్రిక్స్‌ ను నేర్చుకునేందుకు కెనడా కు చెందిన రామన్‌ శర్మ వద్ద విజయ్‌ శిక్షణ తీసుకున్న విషయం తెల్సిందే. విజయ్‌ కి ట్రైనింగ్‌ ఇచ్చినందుకు గాను రామన్‌ శర్మకు కొంత మొత్తంలో పారితోషికం కూడా ఇస్తామని నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కాని సినిమా పూర్తి అయ్యింది - సినిమా విడుదల అయ్యింది - థియేటర్లలోంచి పోయింది - సంవత్సరం అవుతోంది.. ఇంకా కూడా రామన్‌ కు దక్కాల్సిన పారితోషికం దక్కలేదట. దాంతో తాజాగా సోషల్‌ మీడియాలో రామన్‌ ఈ విషయమై పోస్ట్‌ చేశాడు.

మెర్షల్‌ పారితోషికం ఇంకా రాలేదు అంటూ నిర్మాణ సంస్థకు మెసేజ్‌ పెట్టాను. వారు రిప్లై ఇచ్చారు, త్వరలోనే అమౌంట్‌ వస్తుందని చెప్పారు అంటూ తాను చేసిన ఛాటింగ్‌ ను రామన్‌ వీడియోలో చూపించడం జరిగింది.