Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః 30 ఏళ్లు వెనక్కు తీసుకు వెళ్లిన తలైవి

By:  Tupaki Desk   |   27 March 2021 10:19 AM GMT
ఫొటోటాక్‌ః 30 ఏళ్లు వెనక్కు తీసుకు వెళ్లిన తలైవి
X
అరవింద స్వామి.. మధుబాల జంట అనగానే ఇప్పటికి ఎప్పటికి ఎంతో మందికి 'రోజా' సినిమా గుర్తుకు వస్తుంది. అద్బుతమైన ప్రేమ కథతో పాటు ఆకట్టుకునే సంగీతం తోడై 'రోజా' సినిమా ఇండియాస్‌ ఎవర్‌ గ్రీన్‌ సినిమాగా నిలిచింది అనడంలో సందేహం లేదు. దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన రోజా సినిమా ఇప్పటికి అంతే ఫ్రెష్‌ గా ఉంటుంది. సినిమా విడుదల తర్వాత ప్రతి అమ్మాయి కూడా తనకు అరవింద్ స్వామి వంటి భర్త కావాలని.. ప్రతి అబ్బాయి కూడా తనకు మధుబాల వంటి భార్య కావాలని కోరుకుని ఉంటారు. ఒక బ్యూటీ ఫుల్ ప్రేమ కథతో పాటు దేశ భక్తిని కూడా చూపించిన రోజా సినిమా స్టార్స్‌ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

కంగనా రనౌత్‌ ముఖ్య పాత్రలో నటించిన 'తలైవి' సినిమా లో ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా సినిమా లోని ఈ ఫొటోను విడుదల చేశారు. అరవింద్ స్వామితో మధుబాలను ఇందులో చూడవచ్చు. ఎంజీఆర్‌ గా అరవింద్‌ స్వామి కనిపిస్తూ ఉండగా మధుబాల ఆయన భార్య జానకి రామచంద్రన్‌ గా కనిపించబోతుంది. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా చేసిన జానకి రామచంద్రన్‌ తమిళ ప్రజలకు సుపరిచితులు. అందుకే ఆ పాత్రను మధుబాల వంటి స్టార్ తో చేయించారు. ఆ పాత్ర కు పెద్దగా ప్రాముఖ్యత ఉండదని మొదట భావించారు. కాని కథలో జానకి రామచంద్రన్‌ పాత్ర చాలా కీలకం అంటూ ఇటీవల విడుదలైన పోస్టర్‌ మరియు వీడియోను బట్టి అర్థం అవుతుంది. అరవింద్ స్వామి మరియు మధుబాల కాంబో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.