Begin typing your search above and press return to search.

# D43 ఆన్ లొకేష‌న్ హీరోతో క‌లిసే మ్యాగీ తిని పుస్త‌కాలు చ‌దువుతోంది!

By:  Tupaki Desk   |   19 Feb 2021 10:10 AM GMT
# D43 ఆన్ లొకేష‌న్ హీరోతో క‌లిసే మ్యాగీ తిని పుస్త‌కాలు చ‌దువుతోంది!
X
పేట‌.. మాస్ట‌ర్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది మాళ‌విక మోహ‌న‌న్. సౌత్ లో వ‌రుస సినిమాల‌తో ఈ అమ్మ‌డు బిజీగా ఉంది. త‌దుప‌రి తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనూ ఘ‌న‌మైన ఎంట్రీ కోసం ఆశిస్తోంది. అన్నీ స‌రిగా కుదిరితే రౌడీ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఈపాటికే అభిమానుల ముందుకు రావాల్సింది. కానీ కుద‌ర‌లేదు.

ప్ర‌స్తుతం త‌మిళంలో ధ‌నుష్ స‌ర‌స‌న ఓ క్రేజీ చిత్రంలో న‌టిస్తోంది మాళ‌విక‌. త‌న ఫేవ‌‌రెట్ స్టార్ ధ‌నుష్ స‌ర‌స‌న # D43లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినందుకు తెగ ఉబ్బి త‌బ్బిబ్బ‌యిపోతోంది.

``నా తోటి లియో (ఇది ఒక రాశి) సహ నటుడి‌తో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది! మీ నుంచి దూరంగా ఉంటే ఆ అంద‌మైన నవ్వును కోల్పోతాను. ప్రతిరోజూ మీ నుండి చాలా నేర్చుకునే అవ‌కాశం కోల్పోతాను. ‘మాగీ’ పై మన పరస్పర ప్రేమను మిస్స‌వుతాను! అంటూ ఎంతో పోయెటిక్ గానే స్పందించింది అమ్మ‌డు.

# D43 మొదటి షెడ్యూల్ శ‌ర‌వేగంగా పూర్త‌యింది. ప్ర‌స్తుతం రెండవ షె‌డ్యూల్ ప్రారంభించడానికి వేచి చూడ‌లేను! అని మాళ‌విక ఇన్ స్టాలో వెల్ల‌డించింది. మ‌న ఇద్దరికీ ఒకే భావన. మీతో కలిసి పనిచేయడాన్ని.. పుస్తకాల గురించి చాలా పంచుకునేందుకు చాలా సమయం ఉంది. చీర్స్!! అంటూ ఎంతో ఇది అయిపోయింది మాళ‌విక‌. ఇక సోష‌ల్ మీడియాల్లో మాళ‌విక హాటెస్ట్ ఫోటోషూట్స్ అంతే వైర‌ల్ గా మారుతున్న సంగ‌తి తెలిసిన‌దే.