Begin typing your search above and press return to search.

పోస్ట‌ర్ టాక్: `మ్యాస్ట్రో`ని ఏదీ ఆప‌లేదు!

By:  Tupaki Desk   |   30 March 2021 3:38 AM GMT
పోస్ట‌ర్ టాక్: `మ్యాస్ట్రో`ని ఏదీ ఆప‌లేదు!
X
యూత్ స్టార్ నితిన్ హీరోగా మెర్లపాక గాంధీ దర్శకత్వం వ‌హిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. నితిన్ కెరీర్ 30వ చిత్ర‌మిది. ఈ రోజు నితిన్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్.. టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేశారు.

పోస్ట‌ర్ లో నితిన్ లుక్ ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తోంది. జీన్స్ దానిపై సూట్ ధ‌రించి చేతిలో వా‌కింగ్ స్టిక్ ప‌ట్టుకుని క‌నిపిస్తున్నాడు. ఆ క‌ళ్ల‌కు న‌ల్ల‌ద్దాలు ధ‌రించిన తీరు చూస్తుంటే అత‌డు అంధుడు అని అర్థ‌మవుతోంది. ఆస‌క్తిక‌రంగా బ్యాక్ గ్రౌండ్ లో పియానోపై ర‌క్త‌పు మ‌ర‌క‌లు చూడ‌గానే ఇది మ్యూజిక్ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ అని హింట్ ఇచ్చిన‌ట్ట‌య్యింది. నితిన్ ఈ చిత్రంలో అంధుడిగా అసాధారణ పాత్ర పోషించ‌నున్నారు.

ఈ సినిమా క‌థాంశం క‌థానాయ‌కుడి అంధ‌త్వ‌ లోపం.. ల‌వ్ ఎమోష‌న్ అనే ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది. టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో తమన్నా భాటియా కీలక పాత్రధారి. న‌భా నటేష్ మ‌రో క‌థానాయిక‌.

నితిన్ న‌టించిన 29వ చిత్రం రంగ్ దే బ్లాక్ బస్టర్ దిశ‌గా ప‌య‌నించ‌డం ఈ సినిమాకి ప్ల‌స్ కానుంది. భీష్మ చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన మహతి స్వరా సాగర్ రెండవసారి నితిన్ తో కలిసి పని చేస్తున్నారు. శ్రేష్త్ మూవీస్ బ్యానర్ లో ఎన్ సుధాకర్ రెడ్డి -నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.., రాజ్ ‌కుమార్ అకెల్ల ఈ సినిమాకి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జె యువరాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. జూన్ 11 న మాస్ట్రోను విడుదల చేస్తామని మేకర్స్ మరోసారి ప్రకటించారు. 2021 లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా బ‌రిలో దిగుతున్న `మాస్ట్రో` బాలీవుడ్ బ్లాక్ అంధాధున్ కి రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నరేష్- జిషుసేన్ గుప్తా- శ్రీముఖి- అనన్య, హర్షవర్ధన్- రాచ్చ‌ రవి- మంగ్లీ- శ్రీనివాస్ రెడ్డి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.