Begin typing your search above and press return to search.

మసాలా మూవీస్ కి ఎప్పుడూ రెడీ

By:  Tupaki Desk   |   11 March 2016 9:00 PM IST
మసాలా మూవీస్ కి ఎప్పుడూ రెడీ
X
మడోన్నా సెబాస్టియన్.. మలయాళ మూవీ ప్రేమమ్ తో ఒక్కసారిగా సౌత్ లో అన్ని రంగాలకి పరిచయమైపోయింది. ఇందులో ఈమె నటించిన సెలీన్ పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. ఎక్కడికి వెళ్లినా అదే పేరుతో పిలుస్తున్నారని.. ఇప్పుడిప్పుడే తన అసలు పేరు జనాలు తెలుసుంటున్నారని అంటోంది మడోన్నా. ఈ భామ ప్రస్తుతం తమిళ్ లో విజయ్ సేతుపతి సరసనన 'కాదలమ్ కాతండు పోగుం' చిత్రంలో నటించింది. ఈ శుక్రవారమే రిలీజ్ అయిన ఈ మూవీలో గ్లామర్ రోల్ లోనే నటించింది మడోన్నా.

ప్రేమమ్ లో పద్ధతిగా కనిపించి ఒక్కసారిగా గ్లామర్ అవతారం చూపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాను గ్లామర్ రోల్స్ - మసాలా పాత్రలు చేయనని ఎప్పుడు చెప్పాను అని ఎదురు ప్రశ్నించేస్తోంది ఈ సుందరాంగి. ఇలాంటి బోర్డర్స్ గీసుకుంటే మంచి పాత్రలు ఎలా వస్తాయని నిలదీసేసింది కూడా. తాను పెట్టుకున్న కండిషన్స్ విజయ్ సేతుపతి లాంటి హీరో పక్కన చేసే ఆఫర్ పోగొట్టుకోలేను కదా అని క్వశ్చన్ చేసింది.

ఇక ప్రేమమ్ లో మడోన్నా చేసిన సెలీన్ కేరక్టర్ ఎంతగా క్లిక్ అయిందంటే.. తెలుగు రీమేక్ లో ఈ పాత్ర కోసం చాలా మందిని జల్లెడ పట్టి.. చివరకు మడోన్నా సెబాస్టియన్ కే మొగ్గు చూపారు. త్వరలో తెలుగు ప్రేమమ్ షూటింగ్ లో పాల్గొనేందుకు టాలీవుడ్ వచ్చేస్తోంది మడోన్నా. ఈ కేరక్టర్ ఇక్కడ కూడా క్లిక్ అయితే.. మనకు మరో మసాలా హీరోయిన్ దొరికేసినట్లే.