Begin typing your search above and press return to search.

ఆడియో డేట్ లీక్ చేసిన మడొన్నా

By:  Tupaki Desk   |   21 Aug 2016 11:36 AM IST
ఆడియో డేట్ లీక్ చేసిన మడొన్నా
X
మలయాళీ కుట్టి మడొన్నా సెబాస్టియన్.. టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. మల్లూవుడ్ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ ను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. ఒరిజినల్ ప్రేమమ్ లో తాను పోషించిన పాత్రను.. తిరిగి తెలుగులోనూ చేస్తోంది మడొన్నా.

టాలీవుడ్ లో సినిమా షెడ్యూల్ బాగా టైట్ అయిపోవడంతో.. ప్రేమమ్ కి సంబంధించిన అప్ డేట్స్ ఏమీ రావడం లేదు. ఇప్పటికే పిక్చరైజేషన్ దాదాపుగా పూర్తయిపోయినా.. విడుదల తేదీ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. సెప్టెంబర్ 9న రిలీజ్ అనే మాట మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పుడీ వాదనకు బలం చేకూరుస్తూ.. మడొన్నా ఓ లీక్ ఇచ్చేసింది. ఆడియో రిలీజ్ డేట్ ను కన్ఫాం చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది అమ్మడు.

'తెలుగు ప్రేమమ్ ఈ సెప్టెంబర్ లో వచ్చేస్తోంది. ఆగస్ట్ 24న ఆడియో లాంఛ్' అంటూ తన సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది మడొన్నా సెబాస్టియన్. దర్శకుడు చందూ మొండేటితో పాటు ఎవరూ ప్రేమమ్ అప్ డేట్స్ ని అంత త్వరగా ఇవ్వడం లేదు కానీ.. ఈ భామ మాత్రం టాలీవుడ్ అరంగేట్రానికి మహా ఉత్సాహం చూపించేస్తోంది. అందుకే ఇలా ఆడియో డేట్ ని లీక్ చేసేసి.. తన ఆనందాన్ని పంచేసుకుంది.