Begin typing your search above and press return to search.

ప్రేమమ్ బ్యూటి.. ట్విట్టర్లో పంచుతోంది

By:  Tupaki Desk   |   14 April 2017 12:56 PM GMT
ప్రేమమ్ బ్యూటి.. ట్విట్టర్లో పంచుతోంది
X
ప్రేమమ్ సినిమాలో చేసిన హీరోయిన్లు అందరూ మన టాలీవుడ్ ప్రేక్షకులను తెగ ఇంప్రెస్ చేసేశారు. ముఖ్యంగా శృతి హాసన్.. తరువాత అనుపమ పరమేశ్వరన్.. అదరగొట్టేశారంతే. ఇప్పటికే ట్విట్టర్ వంటి వేదికల్లో 5 మిలియన్ ఫాలోవర్లను ప్రేమను ఎంజాయ్ చేస్తోంది శృతి. అలాగే అనుపమ కూడా మాంచి సంఖ్యలో అభిమానగణాన్ని సంపాందించింది. కాని మడోన్నా సెబాస్టియన్ మాత్రం.. ఇంకా ఖాతా తెరువలేదు.

ఇప్పటికే ట్విట్టర్లో చాలా ఫేక్ ఎకౌంట్లు మడోన్నా పేరు మీద రన్ అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు తన ఒరిజినల్ ఖాతాను తెరిచి.. ట్విట్టర్లో కూడా ఇక మీదట అభిమానులకు ప్రేమ పంచుతాను అంటోంది ఈ మలయాళ సుందరి. ఈరోజు రిలీజైన తమిళ సినిమా పా పాండి లో ధనుష్‌ తో కలసి జతకట్టిన మడోన్నా.. ఆ సినిమాలో బాగా ఇంప్రెస్ చేస్తూనే.. ఇదే సందర్భంగా ట్విట్టర్లోకి కూడా అడుగపెట్టేసింది. ఓ రెండు రోజుల క్రితమే తన మొదటి ట్వీటును వేసిందిలే. @MadonnaSebast14 అనే పేరుతో ఈమె ఎకౌంట్ నడుస్తోంది.

ఇకపోతే ఈమె సినిమా షూటింగ్ లొకేషన్లో హీరో ధనుష్‌ తో గొడవపడిందని ఒక రూమర్ వినిపించడంతో.. అమ్మడు వాటిపైన క్లారిటీ ఇవ్వడానికే ట్విట్టర్లోకి వచ్చిందా అంటున్నారు జనాలు. అయితే అసలు ఆ గొడవను ఈమె పి.ఆర్. టీమే స్వయంగా లీక్ చేసి.. అమ్మడి కోసం బజ్ క్రియేట్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయ. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/