Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ: `సెభాష్‌`టియ‌న్ మ‌డోన్నా!

By:  Tupaki Desk   |   21 Sep 2016 9:05 AM GMT
ఫొటోస్టోరీ: `సెభాష్‌`టియ‌న్ మ‌డోన్నా!
X
ప్రేమ‌మ్ ఆడియో వేడుక అందాల‌తో మిరుమిట్లు గొలుపుతుంద‌ని ఊహించారంతా. ఎందుకంటే ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లున్నారు మ‌రీ! అయితే ఏమైందో తెలియ‌దు కానీ... అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వేడుక‌కి హాజ‌రు కాలేదు. మిగిలిన శ్రుతిహాస‌న్‌ - మ‌డోన్నా సెబాస్టియ‌న్‌ లు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అయితే ముగ్గురూ వేడుక‌కి వ‌చ్చినా అందులో శ్రుతినే ప్ర‌ధాన ఎట్రాక్ష‌న్‌ గా నిలుస్తుంద‌ని ఊహించారంతా. కానీ ఆమెని సైతం మించిపోయే అందంతో ముస్తాబై వ‌చ్చింది మ‌డోన్నా. టీవీల్లోనూ - వేడుక‌లో ప్ర‌త్య‌క్షంగానూ మ‌డోన్నాని చూసిన కుర్ర‌కారు త‌మ‌ను తాము మ‌రిచిపోయారు. చిట్టిపొట్టి డ్రెస్సులు చేసే మాయే అది. మ‌డోన్నా చిన్న గౌనుతో వేడుక‌కి హాజ‌రైంది. పిక్క‌లు క‌నిపించే త‌న ట్రెండీ అందాలు చూపిస్తూ ఫొటోగ్రాఫ‌ర్ల‌కి చేతినిండా ప‌ని దొరికేలా చేసింది.

ఆమె ఘాటైన అందం ముందు శ్రుతి గ్లామ‌ర్ కూడా చిన్న‌బోయినంత ప‌నైంది. మ‌డోన్నాని చూసి తెలుగు సినిమా క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కి త‌గ్గ‌ట్టుగా ఉంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు మాట్లాడుకొంటున్నాయి. అంత‌గా ఆక‌ర్షించాక ఇక మ‌న ద‌ర్శ‌కనిర్మాత‌లు ఆమెకి ఆఫ‌ర్లు ఇవ్వ‌కుండా ఉంటారా? మ‌నం కూడా సెబాస్టియన్‌ని ఒక‌సారి శెభాష్ అని ప్రోత్స‌హించేద్దాం మ‌రీ!