Begin typing your search above and press return to search.

అక్కడైనా అమ్మడి ఫేట్‌ మారుతుందా?

By:  Tupaki Desk   |   2 July 2015 7:00 PM IST
అక్కడైనా అమ్మడి ఫేట్‌ మారుతుందా?
X
కోలమొహం చిన్నది మధురిమ ఏమైంది? ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో కనిపించలేదేం? ఆ ఒక్కడు, మౌనరాగం, టెంపర్‌, దోచెయ్‌ చిత్రాల్లో కనిపించింది ఈ అమ్మడు. సరదాగా కాసేపు అంటూ వంశీ డైరెక్షన్‌లోనూ నటించింది. కానీ ఏం లాభం అన్నీ వృధా ప్రయత్నాలే అయ్యాయి. ఫ్లాపులు వెక్కిరించాయి. దాంతో పొరుగు భాషల్లో అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లింది.

మధురిమ ప్రయత్నాలు ఫలించి తమిళ్‌, హిందీ, కన్నడలో ఛాన్సులొచ్చాయి. ఇటీవలే సవారీ 2లో నటించింది. కానీ ఈ సినిమా మధురిమ కెరీర్‌ సవారీకి ఉపయోగపడనేలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కునికి సోదరిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోసారి సుపారి సూర్య చిత్రంలో విరాట్‌ సరసన నాయికగా ఛాన్సాందుకుంది.

ఇదో అందమైన ప్రేమకథా చిత్రం. యాక్షన్‌, లవ్‌ మిక్స్‌తో లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. త్వరలోనే రిలీజ్‌కి రానున్న ఈ చిత్రం తన ఫేట్‌ మారుస్తుందని భావిస్తోంది. అలాగే తనూజ్‌ విర్వానీ, సన్నీలియోన్‌ తో కలిసి వన్‌ నైట్‌ స్టాండ్‌ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. దీంతో ఉత్తరాదినా ఊపొస్తుందని ఆశిస్తోంది. కనీసం ఈ రెండు పరిశ్రమల్లో అయినా మధురిమ కెరీర్‌ వెలుగుతుందేమో చూడాలి.