Begin typing your search above and press return to search.

మేక‌ప్ ఫెయిల్‌.. మ‌ధురిమ‌కు ఏమైంది?

By:  Tupaki Desk   |   14 May 2020 10:15 AM IST
మేక‌ప్ ఫెయిల్‌.. మ‌ధురిమ‌కు ఏమైంది?
X
లాక్ డౌన్ వేళ ఒక్కొక్క‌రు ఒక్కోలా ప్ర‌యోగం చేస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఇంటికే అంకిత‌మై ర‌క‌ర‌కాల వ్యాప‌కాల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. కొంద‌రు కిచెన్ లో ప్ర‌యోగాలు చేస్తుంటే మ‌రికొంద‌రు ఇంటి క్లీనింగ్ .. తోటమాలి ప‌ని చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. బంధుమిత్రుల‌తో ఫామ్ హౌస్ ల‌లోనూ స‌ర‌దా కాల‌క్షేపం చూస్తున్న‌దే. అయితే వీళ్లంద‌రి కంటే డిఫ‌రెంటుగా మ‌ధురిమ లాంటి కొంద‌రు మేకప్ విష‌యంలో ప్ర‌యోగాలు చేస్తున్నారు.

గ‌త కొంత‌కాలంగా మ‌ధురిమ లైమ్ లైట్ లో లేని సంగ‌తి తెలిసిందే. తెలుగులో కొన్ని వ‌రుస సినిమాల్లో న‌టించినా స‌క్సెస్ లేక తెర‌మ‌రుగైంది. ఆ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ తిరిగి అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చింది. ఈ కోల ముఖం చిన్న‌ది తాజాగా హెయిర్ స్టైలింగ్ విష‌యంలో ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేసింది. అందుకు సంబంధించిన ఫోటోషూట్ ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

పూర్తిగా వెస్ట్ర‌న్ లుక్ లో లేడీ గాగాను త‌ల‌పించే లుక్ కోసం ప్ర‌యోగ‌మే చేసింది మ‌ధురిమ. కానీ ఈ ప్ర‌యోగం విక‌టించిన‌ట్టే క‌నిపిస్తోంది. ఆ పెట్టుడు విగ్గు ఇట్టే తెలిసిపోతోంది. అలాగే ఏజ్ క్లియ‌ర్ గా తెలిసి పోతోంది. ఆ ముఖానికి మేక‌ప్ కూడా మ‌రీ డ‌మ్మీగా క‌నిపిస్తోంది. మ‌ధురిమ‌ను ఇలా చూస్తే ఎవ‌రైనా అవ‌కాశాలిస్తారా? అంటూ యూత్ ఒక‌టే కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు. పాపం ఎర‌క్క‌పోయి ఇలా చేసిందా ఏమిటో కానీ మ‌ధురిమ ట్ర‌య‌ల్ అలా ఫెయిలైంది.