Begin typing your search above and press return to search.

ఒళ్లు దగ్గర పెట్టుకునే పనిచేశాం!!

By:  Tupaki Desk   |   27 Jun 2016 4:27 PM IST
ఒళ్లు దగ్గర పెట్టుకునే పనిచేశాం!!
X
''ఒక మనసు'' సినిమా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్‌ ఈరోజు మీడియా సమావేశంలో కాస్త ఘాటుగానే స్పందించారనే చెప్పాలి. నిజానికి చాలా సినిమాలు రివ్యూలు నెగెటివ్‌ గా వచ్చినా కూడా ధియేటర్లలో కలక్షన్లు కురుస్తున్న పరిస్థితి. ఇప్పుడు నిహారిక అండ్‌ నాగ శౌర్య జంటగా వచ్చిన ఈ సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సినిమాను ప్రముఖ ఛానల్ టివి9 తో కలసి మధుర శ్రీధర్‌ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు.. అసలు ఈ సినిమాలో స్ర్కీన్ ప్లే పై ఫోకస్ పెట్టలేదని.. కథను ఇంకాస్త సరిచూసుకునుంటే బాగుండేదని అడగటంతో.. శ్రీదర్‌ కాస్త ఘాటుగా స్పందించారు. ''హిట్టయిన ప్రతీ సినిమా స్ర్కీన్ ప్లే సూపర్ గా ఉండదు.. అలాగే ఫ్లాపైన సినిమాలో అవన్నీ లేనట్లు కాదు. ఒళ్ళుదగ్గర పెట్టుకునే పని చేశాం. ఒక ఐఐటి ఎంట్రన్స్ పరీక్షంలో సీటు వచ్చినంత మాత్రాన మీ అబ్బాయి అందరికంటే ఇంటెలిజెంట్‌ కాదు. రానంత మాత్రాన ఇంటెలిజెంట్‌ కాకుండా పోడు. అలాగే సినిమాలు కూడా. అందరికీ నచ్చాలని రూల్‌ లేదు. 42% ఓట్లు మాత్రమే వచ్చిన నరేంద్రమోడి ప్రధాన మంత్రి కాలేదా? సినిమాలు కూడా అలాగే తక్కువ శాతం మందికి నచ్చినా కలక్షన్లు తెస్తాయి. మా పెట్టుబడి రికవర్‌ అయిపోతుంది'' అంటూ చెప్పుకొచ్చారు.

చూద్దాం.. మరి శ్రీధర్‌ కాన్ఫిడెన్స్ ఎంతవరకు బాక్సీఫీస్‌ కలక్షన్లకు తేవడంలో వర్కవుట్ అవుతుందో!!