Begin typing your search above and press return to search.

ఆయ‌న‌కి శుభ‌లగ్నం సినిమా గుర్తొచ్చింది

By:  Tupaki Desk   |   19 April 2018 10:01 AM GMT
ఆయ‌న‌కి శుభ‌లగ్నం సినిమా గుర్తొచ్చింది
X

మ‌ధురా ఆడియో ద్వారా సినీ రంగంలోకి వ‌చ్చి ద‌ర్శ‌కుడిగా- నిర్మాత‌గా త‌న‌కంటూ ఓ సెప‌రేట్ ముద్ర వేసుకున్నాడు మ‌ధురా శ్రీ‌ధ‌ర్‌. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న నిర్మించిన ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ సినిమా ఈ మధ్యన వచ్చి నిరాశ పరిచింది. ఇకపోతే ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీ‌రెడ్డి రేపుతున్న క‌ల‌క‌లం గురించి ట్విట్ట‌ర్ లో స్పందించాడు ఈ దర్శకనిర్మాత. పేర్లు ప్రస్తావించకుండా చితక్కొట్టేశాడు అంటున్నారు నెటిజన్లు.

శ్రీ‌రెడ్డి పేరును ఎక్క‌డా ప్ర‌స్తావించ‌ని మ‌ధురా శ్రీ‌ధ‌ర్‌... చెబుతున్న‌ది మాత్రం ఆమె గురించేన‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ‘మ‌నం చేయాల్సిందంతా కావాల‌ని చేసేసి... ఫైన‌ల్ గా క్ష‌మాప‌ణ‌లు- సారీలు చెబితే స‌రిపోతుందా? అది గొప్పేమీ కాదు. వీ ఆర్ లివింగ్ ఇన్ ఎ సోసైటీ. ప్ర‌తీ ఒక్క‌రికీ భ‌యం బాధ్య‌తా ఉండాలి. లేకుంటే మ‌న‌కూ అడ‌విలో జంతువుల‌కూ తేడా లేదు’ అంటూ మ‌హేష్ బాబు ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా టీజ‌ర్ లోని డైలాగుల‌న్నీ చెప్పేసిన మ‌ధురా శ్రీ‌ధ‌ర్‌... చివ‌ర్లో ‘నువ్వు దిగ‌డానికి ఇంక మెట్లు లేవు... శుభ‌లగ్నం సినిమా డైలాగు గుర్తొస్తున్న‌ది’ అంటూ ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చాడు.

ప్ర‌తీ ఒక్క‌రిలో ఏదో ఒక సినిమాలో పాత్ర‌ను చూసే మ‌ధురా శ్రీ‌ధ‌ర్‌... శ్రీ‌రెడ్డిని శుభ‌లగ్నం సినిమాలో ఆమ‌ని పాత్ర‌తో పోల్చాడ‌న్న మాట‌. ఆమ‌నిలా డ‌బ్బు మీద‌... పేరు - పాపులారిటీ మీద వ్యామోహం తోనే అమ్మ‌డు ఇలా ర‌చ్చ చేస్తుంద‌ని ఈ ద‌ర్శ‌కు నిర్మాత ఉద్దేశం కావ‌చ్చు. ఈ మాట వింటే శ్రీ‌రెడ్డి కూడా ‘ఏమిటో....’ అంటూ ఆమ‌ని స్టైల్లో ఓ వెట‌కార‌పు డైలాగేస్తుందేమో!

అయితే ఆయన కామెంట్లు.. శ్రీరెడ్డి మీద మాత్రమే కాదు.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కూడా టార్గెట్ చేసినట్లే ఉన్నాడు అంటున్నారు మరికొందరు. ఎందుకంటే వర్మ కూడా సేమ్ ఈయన చెప్పినట్లే పవన్ ను బూతులు తిట్టు అంటూ తెగ మెట్లు దిగిపోతున్నాడు.