Begin typing your search above and press return to search.

ట్రిపుల్ స్ట్రాంగ్ రాజా : టీజర్ రివ్యూ

By:  Tupaki Desk   |   21 March 2019 12:53 PM IST
ట్రిపుల్ స్ట్రాంగ్ రాజా : టీజర్ రివ్యూ
X
గత నెలలో యాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కొత్త సినిమా మధుర రాజా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దీని టీజర్ రిలీజ్ చేసింది యూనిట్. పక్కా మాస్ లుక్ తో పల్లెటూరి పంచె కట్టుతో ఎప్పుడో 90ల కాలం నాటి హీరోయిజంని ఎలివేట్ చేసిన తీరు అభిమానులకు బాగా కనెక్ట్ అవుతోంది.

పక్కగా మడిచిన పొడవైన మీసకట్టుతో ఓ పక్క యాక్షన్ ఎపిసోడ్స్ లో రౌడీలను చితక్కొడుతూనే మరోవైపు పవర్ ఫుల్ పంచు డైలాగులు మమ్ముట్టి విసిరిన తీరుకు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాంటి ఫ్యాక్షన్ తరహా బ్యాక్ డ్రాప్ మనవాళ్లకూ కొట్టిన పిండే కాబట్టి డబ్బింగ్ చేస్తే వర్క్ అవుట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి

వైశాఖ్ దర్శకత్వం వహించిన మధురరాజా గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ పోకిరి రాజాకు సీక్వెల్. దానికి కొనసాగింపుగా ఇది తీశారు. సన్నీ లియోన్ స్పెషల్ ఐటెం సాంగ్ ఇందులో మరో ఆకర్షణ. మనదగ్గరా బిజీగా ఉన్న సంగీత దర్శకుడు గోపి సుందర్ మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణ. మొత్తానికి అంచనాలు పెంచడంలో మధుర రాజా బాగానే వర్క్ అవుట్ చేసుకున్నాడు. కేవలం నిమిషం లోపే ఉన్న టీజర్ కావడంతో కథ గురించి ఎక్కువ ఊహించే ఆస్కారం ఇవ్వలేదు. తెలుగులో ఈ మధురరాజా వస్తాడా రాడా అనేది తేలాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి