Begin typing your search above and press return to search.

బాలీవుడ్ భార్యల బండారం బయటేస్తున్నాడు

By:  Tupaki Desk   |   19 Jan 2016 1:30 PM GMT
బాలీవుడ్ భార్యల బండారం బయటేస్తున్నాడు
X
అందంగా గ్లామర్ ఫీల్డ్ లో పలు విభాగాల వెనుక ఉండే చీకటి కోణాలను తెరకెక్కించడంలో మధుర్ భండార్కర్ చాలా ట్యాలెంటెడ్. ఫ్యాషన్ - హీరోయిన్ - కేలండర్ గర్ల్స్ లాంటి సినిమాలన్నీ ఇవే తరహా కాన్సెప్ట్ తో రూపొందాయి. ఇప్పుడు ఈయన మేడమ్ జీ అనే సినిమా చేసేందుకు పూర్తి స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నాడు. ఇందులో ఫ్యాషన్ బ్యూటీ ప్రియాంక చోప్రానే చేయాలన్నది ఈయన ఆలోచన.

మేడమ్ జీ స్క్రిప్ట్ పై ప్రియాంక కూడా ఫుల్లు హ్యాపీగానే ఉంది. ఖచ్చితంగా తనే చేస్తానని, వేరే ఎవరితోనూ తీయద్దని కూడా చెప్పింది. అయితే, ఇప్పుడామె హాలీవుడ్ - బాలీవుడ్ మధ్య చక్కర్లు కొడుతూ బిజీగా ఉంది. దీంతో ఈ మేడమ్ జీ కోసం మరింతకాలం వెయిట్ చేయాల్సి రానుంది. అందుకే ఈ మధ్యలో మరో సినిమాని తెరకెక్కించేందుకు మధుర్ భండార్కర్ సిద్ధమయ్యాడు. బాలీవుడ్ వైవ్స్ అంటూ.. బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల భార్యల పేజ్ 3 కార్యకలాపాలను చూపించబోతున్నాడంటున్నారు. ఇందులో ఒక హీరోయిన్ కూడా ఉంటుందని, ఈ బాలీవుడ్ వైవ్స్ కారణంగా ఈమె జీవితం ఎలా పతనం పాలైందో చెప్పడం.. ఈ స్టోరీ కాన్సెప్ట్ అని తెలుస్తోంది.

సెలబ్రిటీల భార్యలు, వారి జీవితం అంటే వినేందుకే ఇంట్రెస్టింగ్ టాపిక్. దీన్ని మధుర్ భండార్కర్ తెరకెక్కిస్తే మరింత రసవత్తరంగా ఉంటుంది. దీనికి తోడు మొత్తం మహిళల బేస్డ్ గానే సాగే ఈ మూవీ.. ఫుల్ ప్లెడ్జెడ్ గ్లామర్ విందు అంటున్నారు. గ్లామర్ అనే పేరు వెనుక ఉన్న ప్రతీ చీకటి కోణాన్ని వదలకుండా మూవీగా తీసేట్లున్నాడు మధుర్ భండార్కర్.