Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమాకు ఆయన రాయట్లేదు

By:  Tupaki Desk   |   11 Feb 2018 3:50 PM IST
ఎన్టీఆర్ సినిమాకు ఆయన రాయట్లేదు
X
ఏదో హాలీవుడ్ సినిమా నుంచి.. లేదా ఏదైనా లోకల్ నవల నుంచి స్ఫూర్తి పొందడం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కు అలవాటే. గతంలో త్రివిక్రమ్ తీసిన చాలా సినిమాల్లో హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది. తాజాగా ఆయన రూపొందించిన ‘అజ్ఞాతవాసి’ కథను ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’ నుంచి ఎత్తుకొచ్చేశాడని ఆరోపణలెదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఇక త్రివిక్రమ్ గత సినిమా ‘అఆ’కు యద్దనపూడి సులోచనా రాణి నవల ‘మీనా’ స్ఫూర్తి అన్న సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా విషయంలో రైటర్‌ కు క్రెడిట్ ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది. ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా తయబోయే సినిమాకు మధుబాబు నవల ‘షాడో’ ఆధారమని.. ఈ చిత్రానికి ఆయన రచనా సహకారం కూడా అందిస్తున్నారని.. ఈసారి రచయితకు త్రివిక్రమ్ క్రెడిట్ కూడా ఇవ్వబోతున్నాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఐతే ఇదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది.

త్రివిక్రమ్ సినిమాకు తాను కథ అందిస్తున్నానన్న ప్రచారంలో నిజం లేదని స్వయంగా మధుబాబే చెప్పాడు. ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. త్రివిక్రమ్ సినిమా విషయమై తనను ఎన్నడూ సంప్రదించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి త్రివిక్రమ్ ఈసారి సొంత కథతోనే సినిమా తీయబోతున్నాడని భావించాలి. ఇంకో వారం రోజుల్లోనే ఈ సినిమాకు పని చేసే నటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.