Begin typing your search above and press return to search.

కాల్ గాళ్ రోల్ లో తెలుగు పిల్ల

By:  Tupaki Desk   |   24 Jun 2016 4:36 AM GMT
కాల్ గాళ్ రోల్ లో తెలుగు పిల్ల
X
నచ్చావులే మూవీతో హీరోయిన్ గా పరిచయమైన మాధవీ లత.. ఆ సినిమాతో పేరు సంపాదించినా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. వరుస ఫ్లాప్స్ తో పాటు కెరీర్ కీలక దశలో ఉన్నపుడు స్టడీస్ కోసం అమెరికా వెళ్లిపోవడం.. తిరిగొచ్చాక చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు చేతిలో సినిమాలు లేని పరిస్థితి. ఒకట్రెండు సినిమాలు పూర్తి చేసినా అవి విడుదలకు నోచుకోలేదు.

మరి ఇలాంటి సమయంలో దర్శక నిర్మాతలను - ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు.. సాధారణంగా ఫోటోషూట్స్ పెట్టుకుంటారు హీరోయిన్స్. కానీ మాధవీలత మాత్రం ట్యాలెంట్ తోనే సత్తా చాటుతానంటోంది. అందుకే డేరింగ్ గా ఓ షార్ట్ ఫిలిమ్ ని యాక్సెప్ట్ చేసింది. అందులో మాధవీ లత ఓ కాల్ గాళ్ కేరక్టర్ చేయడం విశేషం. 'ఆన్ మోనాస్ బర్త్ డే' అనే టైటిల్ పై రూపొందిన ఈ షార్ట్ ఫిలిమ్.. కాన్సెప్ట్ బేస్డ్ గా ఉంటుందని అంటున్నారు. ఒక కాల్ గాళ్ - ఆమె ఏడేళ్ల కొడుకు మధ్య అనుబంధాన్నే చూపిస్తారని తెలుస్తోంది.

నరేంద్రనాథ్ అనే దర్శకుడు రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం టీజర్ యూట్యూబ్ లో విడుదలైంది. ప్లాట్ ను పెద్దగా రివీల్ చేయకున్నా.. విజువల్ పరంగా ఆకట్టుకుందనే చెప్పాలి. మాధవీలత చేతిలో సినిమాలు లేకే ఇలా షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటోందనే కామెంట్స్ వినిపిస్తున్నా.. ఈ ప్లాట్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందని.. అందుకే చేశానన్నది ఆ హీరోయిన్ వెర్షన్. 'ఆన్ మోనాస్ డైరీ'కి మంచి పేరు, సక్సెస్ వస్తే.. మాధవీ లత ప్రయత్నం ఫలించినట్లే.