Begin typing your search above and press return to search.

'సెలబ్రిటీలు ప్రభుత్వాలకు డొనేషన్స్ ఇస్తున్నారు.. కానీ అవి ప్రజలకు అందడం లేదు'

By:  Tupaki Desk   |   29 July 2020 2:00 PM GMT
సెలబ్రిటీలు ప్రభుత్వాలకు డొనేషన్స్ ఇస్తున్నారు.. కానీ అవి ప్రజలకు అందడం లేదు
X
టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ రాజకీయ సమకాలీన అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. 'నచ్చావులే' సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో పెట్టింది తెలుగమ్మాయి మాధవీలత. అడపాదడపా సినిమాల్లో నటించి మాధవీలత సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జాతీయ పార్టీ బీజేపీలో చేరింది. అప్పటి నుండి రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ వస్తోంది. ఈ క్రమంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా సమయంలో నటుడు సోనూసూద్ సహాయం చేస్తున్నట్లు టాలీవుడ్ హీరోలు ఎందుకు ముందుకు రావడంలేదు అనే విషయంపై మాధవీలత స్పందించింది.

మాధవీలత మాట్లాడుతూ.. 'కష్టాల్లో ఉన్నవారికి వీలైనంత సాయం చేయమని చెప్తుంటారు. కానీ సాయం చేసే మనసు అందరికి ఉండాలి కదా. అలా అని సాయం చేయమని ఎవరిని బలవంతం పెట్టలేము. మీ దగ్గర ఉంది కదా సాయం చేయండి అని అడిగే హక్కు కూడా ఎవరికీ లేదు. స్వతహాగా సామాజిక బాధ్యతతో సాయం చేయాలని అనిపిస్తేనే ముందుకు వస్తారు అని చెప్పారు. అయితే గుప్త దానాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వారు పేర్లు బయటకి చెప్పుకొని పబ్లిసిటీ చేసుకోడానికి ఇష్టపడరు. కాకపోతే అందరికి సాయం చేసే మనసు లేనప్పటికీ సెలబ్రిటీలు ఒక యూనిటీగా ఉండి ప్రభుత్వం తరపున కష్టాల్లో ఉన్నవారికి సాయం అందేలా చేయవచ్చు. ఎందుకంటే ప్రతి పేదవాడికి అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి సమస్యని వారి దాకా తీసుకెళ్లి సహాయం అందేలా చూడాలి అని సూచించారు.

''ప్రతిదీ మనం నెగిటివ్ గా చూడకూడదు. కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మంది హీరోహీరోయిన్స్ ప్రభుత్వానికి అందించారు. ఐతే వీరందరూ ప్రభుత్వానికి డొనేషన్స్ ఇవ్వకుండా సోనూసూద్ లాగా డైరెక్టుగా వారికే సాయం అందేలా చేస్తే బాగుండేది. ఎందుకంటే ఏ ఫండ్ ని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడానికి కృషి చేయడం లేదు. విలేజ్ లెవెల్లో పై చేసే అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు అందరూ నిధులు తినేస్తూ ప్రజల దాకా వెళ్లనివ్వరు. అందుకే సెలబ్రిటీలు అందరూ ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వకుండా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి డైరెక్టుగా సహాయం చేస్తే సోనూసూద్ కంటే గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ లో హీరోలందరూ కోట్ల రూపాయలు డొనేట్ చేసారు. అదే పేదవారికి డైరెక్టుగా సాయం చేసుంటే రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా మిగిలిపోయేవారు. కానీ ప్రభుత్వానికి అందజేసి ప్రభుత్వం దగ్గర హీరోలుగా మిగిలిపోయారు తప్ప ప్రజలు దగ్గర హీరోలు అనిపించుకోలేకపోయారు'' అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ''మా డబ్బులు మీదే సినిమా వాళ్ళు బ్రతుకుతున్నారు అనడం కూడా కరెక్ట్ కాదు. వారు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కాబట్టే డబ్బులు తీసుకుంటారు. ఒక సినిమా వెనుక ఎందరో కృషి కష్టం ఉంటాయి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఉదాహరణకి లిక్కర్ వల్ల ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం చేకూరుతుంది. అలా అని అందరూ వెళ్లి మా వల్లే ఈ రాష్ట్రం బ్రతుకుతుంది.. మా డబ్బులు తిరిగి ఇచ్చేయండి అని ప్రశ్నించగలరా? అలానే సినిమా వాళ్ళని కూడా మా మీద బ్రతుకుతున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. సినిమా వాళ్ళకి సాయం చేయాలనిపించినంత చేస్తున్నారు. చిరంజీవి అయితే పది కోట్లు చేయాలా? ఆయనకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. కాకపోతే వీళ్లంతా ప్రభుత్వాలకు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు అందడం లేదు. అందుకే ఇప్పటి నుంచి సోనూసూద్ లాగే డైరెక్ట్ పేద ప్రజలకే సహాయం చేస్తే ప్రజల దృష్టిలో అభిమానుల దృష్టిలో గొప్పవాళ్ళుగా మిగిలిపోతారు'' అని మాధవీలత తన అభిప్రాయాన్ని వెల్లడించింది.