Begin typing your search above and press return to search.

కాల్ గాళ్ ని కాదంటున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   2 July 2016 5:47 AM GMT
కాల్ గాళ్ ని కాదంటున్న హీరోయిన్
X
హీరోయిన్ గా గుర్తింపు సంపాదించిన మాధవీ లత ఇప్పుడు షార్ట్ ఫిలిమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నచ్చావులే.. అరవింద్ 2 వంటి చిత్రాలను ఆకట్టుకున్న ఈ భామ.. 'ఆన్ మోనాన్ బర్త్ డే' అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఇప్పటికే ఈ షార్ట్ ఫిలింకి టీజర్ విడుదల కాగా.. జూలై 5న ఈ షార్ట్ ఫిలిమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఈ షార్ట్ ఫిలిమ్ లో నేను మోడల్ గా నటించాను.. స్టోరీ అంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. చాలామంది నేను కాల్ గాళ్ పాత్రను పోషించానని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఇది ఒక మోడల్ కి తన జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా రాసుకున్న స్టోరీ' అని చెప్పింది మాధవీ లత. 12 నిమిషాల నిడివి ఉండే ఈ షార్ట్ ఫిలిమ్ గుడిపాటి వెంకటాచలం రాయగా.. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో రూపొదించారు. దర్శకుడు ఈ స్టోరీ చెప్పనపుడు చాలా ఎగ్జైట్ అయిందట మాధవీలత. అందుకే కొత్తగా ఏదైనా చేద్దామనే ఉద్దేశ్యంతో ఈ షార్ట్ ఫిలిం చేసినట్లు చెబుతోందీ హీరోయిన్.

షార్ట్ ఫిలిమ్స్ సంగతి సరే కానీ అమ్మడూ.. కొత్త సినిమాల ఆఫర్స్ సంగతి కూడా చెప్పచ్చు కదా. అరవింద్ 2 తర్వాత మాధవీ లత నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. గతేడాది ఆంబాలా అనే విశాల్ తమిళ్ మూవీ చేసినా అందులో చిన్న పాత్రే. తెలుగులో చేసిన రెండు సినిమా రెండు సినిమాలు ఆగిపోయాయి. మరి కొత్త సినిమాలు ఒప్పుకోవడంలో కూడా.. షార్ట్ ఫిలిమ్ మాదిరిగానే కాసింత ధైర్యం చేస్తే కెరీర్ గాడిలో పడుతుంది కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.