Begin typing your search above and press return to search.

బ్లడీ స్టుపిడ్‌ అంటూ పోలీస్‌ పై హీరోయిన్‌ ఫైర్‌

By:  Tupaki Desk   |   28 March 2020 5:15 AM GMT
బ్లడీ స్టుపిడ్‌ అంటూ పోలీస్‌ పై హీరోయిన్‌ ఫైర్‌
X
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. కర్ఫ్యూ విధించకున్నా కూడా దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం క్రియేట్‌ చేస్తున్నారు. జనాలు అత్యవసరం అయితేనే బయటకు రావాలి.. అది కూడా ఒక్కరు మాత్రమే రావాలంటూ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఎంత విజ్ఞప్తి చేసినా కూడా కొందరు ఆకతాయిలు మాత్రం బయట తిరిగేందుకు వస్తూనే ఉన్నారు. క్రికెట్‌ ఆడేందుకు కళ్లు తాగేందుకు ఇంకా ఏదో ఏదో చిల్లర పనుల కోసం అంటూ బయటకు వస్తున్నారు. అలా జనాలు బయటకు రావడం వల్ల పోలీసులు అత్యవసరంపై వచ్చే వారిని కూడా వదిలి పెట్టకుండా చితక్కొడుతున్నారు.

పోలీసులు కొడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఒక్కో వీడియోను చూస్తుంటే జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కొందరు ఆ వీడియోలు చూసి కూడా పట్టించుకోవడం లేదు అది వేరే విషయం. పోలీసులు అలా కొట్టడం వల్ల జనాలు కాస్త కట్టడిగా ఉన్నారంటూ కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం ఈ విషయమై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పోలీసులు కొట్టడంతో ఒక్కరు ఇద్దరు మృతి చెందినట్లుగా కూడా ప్రచారం జరుగుతున్న సమయంలో హీరోయిన్‌ మాధవిలత స్పందించింది. ఆమె పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

తాను ఇలా మాట్లాడుతున్నందుకు కొందరు నన్ను విమర్శించే అవకాశం కూడా ఉంది. అయినా పర్వాలేదు నేను అనుకున్నది చెప్తాను అన్నట్లుగా ఆమె ఫేస్‌ బుక్‌ లో పోలీసులు కొడుతున్న వీడియోలను పోస్ట్‌ చేసి బ్లడీ స్టుపిడ్‌ పోలీసులు అంటూ అసహనం వ్యక్తం చేసింది. బయటకు వెళ్లిన వారిపై కేసులు పెట్టండి లేదంటే ఫైన్‌ వేయండి. అంతే తప్ప ఇలా కొట్టడం ఏంటీ. ఏదో ముఖ్యమైన అవసరం ఉన్న వారు మాత్రమే బయటకు వస్తున్నారు. ఒక్కరు ఇద్దరు పని లేకున్నా బయటకు వస్తే మిగిలిన వారందరిని కూడా కొట్టడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ పోస్ట్‌ పెట్టింది.

ఈ పోస్ట్‌ కు తీవ్ర స్థాయిలో కామెంట్స్‌ వస్తున్నాయి. ఆమె ఊహించినట్లుగానే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఈ మాత్రం సీరియస్‌ గా లేకుంటే వాళ్లు మాత్రమే కాదు అందరు కరోనా బారిన పడాల్సి వస్తుంది. పరిస్థితి ఇంత సీరియస్‌ గా ఉన్న సమయంలో పోలీసులు ప్రాణాలతో పోరాడుతూ డ్యూటీ చేస్తుంటే వారిని బ్లడీ స్టుపిడ్‌ పోలీస్‌ అంటావా అంటూ బండ బూతులు తిడుతూ మాధవిలతను ట్రోల్స్‌ చేస్తూ వెంటనే ఈమెపై పోలీసు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కరు ఇద్దరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.