Begin typing your search above and press return to search.

సినీ రాజకీయాలపై ధ్వజమెత్తిన నటి..

By:  Tupaki Desk   |   22 April 2020 12:00 AM IST
సినీ రాజకీయాలపై ధ్వజమెత్తిన నటి..
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలపై హీరోయిన్ మాధవీలత సోషల్ మీడియాలో మరోసారి చెలరేగింది. ఇటీవలే తన ఫేస్‌బుక్ ఖాతాలో సినీ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై ఘాటుగా స్పందించింది. తన ఫేస్‌బుక్ పోస్టుల చిత్రపురి కాలనీలో నాయకుల రాజకీయ యవ్వారాల పై స్పందిస్తూ.. చిత్రపురి కాలనీ పేరు ఎంత బాగుందో.. కానీ ఆ కాలనీలో కేవలం పేద సినిమా కార్మికులు, టీవీ కళాకారులు మాత్రమే ఉంటారు. 2009లో నాకు తెలిసిన ఓ స్నేహితుడు షూటింగ్ సమయంలో.. సభ్యత్వం ఉంటే ఛాంబర్‌లో 25 లక్షలకే 2 లేదా 3 బెడ్‌రూం ఇల్లు కొనుక్కోవచ్చు అని చెప్పినట్లు మాధవీ లత తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ కాలనీలో జరుగుతున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. ఒకసారి వెళ్లి చెక్ చేస్తే అర్ధమవుతుంది. ఆ కాలనీలో బయటివాళ్ళు ఎక్కువ సినిమావాళ్లు చాలా తక్కువ. అంతమంది బయటివాళ్ళు ఎలా ఉంటున్నారు? సినిమా కార్మికులు ఏమయ్యారు? అని మాధవీలత ప్రశ్నించింది.

సినీ పేద కార్మికుల కోసం కేటాయించిన ఇళ్లను ఎక్కువ ధరలో బయటివారు ఎలా కొనుగోలు చేసారు? కమిటిలో ఉన్నవారి మోసాల సంగతేమిటి? వారితో కుమ్మక్కైన సినిమా మంత్రి సంగతేమిటి? ఇలాంటి అన్యాయాలను అడిగేదెవరు? అంటూ.. కనీసం ఇలాంటి విషయాల్లోనైనా హీరోలు ఎందుకు మాట్లాడరు? అని ఫేస్‌బుక్ పోస్టులో నిలదీసి అడిగింది.

రాజధానుల మీద మాట్లాడమంటే రాజకీయాల పార్టీల భయం. మరి సినిమావాళ్ళకి జరిగే అన్యాయం వెనక? కచ్చితంగా పార్టీలు ఉన్నాయి. రౌడీయిజం, కుట్రలు ఉన్నాయి. ఈ అన్యాయాలపై జర్నలిస్టుల వద్ద సాక్షాలు కూడా ఉన్నాయి. కానీ ప్రచురించే దమ్ము ఎవరికీ లేదు. ఎందుకంటే పెద్దలు నడిపే పత్రికలు, పెద్దలు నడిపే టీవీ చానెల్స్‌లో పాపం జర్నలిస్ట్ బతుకెంత? మందు, విందు, పొందుతో సల్లబడతారు. ఇది నిజం ఇదే నిజం నమ్మిన నమ్మకపోయినా, రాసుకొండ్ర అబ్బాయిలు ఎవడేమంటే నాకేంటి? నేను రాసింది నిజం అంతే అని మాధవీలత ధ్వజమెత్తింది. ప్రస్తుతం మాధవీలత పోస్ట్ సోషల్ మీడియాలో, సినీ రాజకీయ వర్గాలలో చర్చనీయంశంగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా వివాదంగా మారిన చిత్రపురి కాలనీ వ్యవహారంపై మాధవీలత స్పందించడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.