Begin typing your search above and press return to search.
చై-సామ్ విడాకులపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 5 Oct 2021 4:00 PM ISTఅక్కినేని నాగచైతన్య - సమంత జంత విడాకుల న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పరస్పర సమ్మతితోనే వీరిద్దరు నాలుగేళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయినప్పటికీ చై-సామ్ జంట ఎందుకు విడిపోయారనేది తెలియకపోవడంతో.. ఈ వ్యవహారం మీద ఎవరికి నచ్చిన విధంగా రకరకాల కథలు అల్లుతున్నారు. కొందరు చైతూ వైపు నుంచి తప్పు ఉందని అంటుంటే మరికొందరు సామ్ సైడ్ నుంచి మిస్టేక్ ఉందని కారణాలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైతన్య - సమంత విడాకుల వ్యవహారం మీద తాజాగా సినీ నటి మాధవీలత స్పందించింది. సమంత కు మద్దతుగా నాగ చైతన్యతో విడిపోవడానికి కారణం ఎంటనేది చెబుతూ ఫేస్ బుక్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
''సినిమా వాళ్ళు పెళ్లి చేసుకున్నా కలిసి ఉండరు.. విడిపోతారు.. సామ్ క్రిస్టియన్ అందుకే ఇలా చేసింది.. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గ్లామర్ డ్రెస్ వేసుకొని ఒళ్ళు చూపిస్తుంది.. అందుకే వదిలేశారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. వీటన్నింటిని గురించి మాట్లాడతాను. ముందుగా సినిమా వాళ్లే కాదు.. బయట కూడా అందరి సంసారాలు రచ్చబండలు, బతుకు జట్కా బండిలే. ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకలేమనని అనుకున్నప్పుడు మ్యూచ్యువల్ అండర్ స్టాండింగ్ తో విడిపోయి స్నేహితులుగా మెలుగుతారు'' అని మాధవీ లత అన్నారు.
''సామ్ ఎప్పుడూ హిందీ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆమె హిందూ దేవుళ్లను మొక్కుతుంది.. గుడికి కూడా వెళ్తుంది. ఇక వేసుకునే బట్టల వల్ల విడిపోయే పనైతే అభిషేక్-ఐశ్వర్యారాయ్.. రణవీర్-దీపికా కూడా విడిపోవాలి. వేసుకునే బట్టలకు కాపురాలకు సంబంధం ఉండదు. సమంత పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య - నాగార్జున లకు తెలియకుండా సినిమాలు చేయలేదు'' అని మాధవీ పేర్కొంది. ''యాంకర్ ప్రదీప్ షో లో సమంత తనకు 30 ఏళ్ళు వచ్చే సరికి తల్లిని అవ్వాలని క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే తన బిడ్డకు 15 ఏళ్ళు వచ్చే సరికి తనతో ఆడుకునే శక్తి ఉండగలగాలని చెప్పింది. అంటే సమంత కు మదర్ అవ్వాలని చాలా ఇష్టం ఉంది. కానీ ఆమె మదర్ అయితే సినిమాలు రావాలని ఎవరు ఆపారు? అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి'' అని తెలిపింది.
ఇంకా మాధవీ లత మాట్లాడుతూ.. ''సమంత చాలా చాలా మంచి అమ్మాయి. మీకు ఆమె బట్టలు మాత్రమే కనిపిస్తాయి. సామ్ ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తుంది. ఓపెనింగ్స్ కి వెళ్తే వచ్చే డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోదు. ఫౌండేషన్ కోసమే యూస్ చేస్తుంది. వాటితో ఎంతో మంది పసిబిడ్డల ప్రాణాలు కాపాడింది. చాలా మంచి మనసున్న మనిషి సమంత. గతంలో ఒక హీరోని ప్రేమిస్తే అతను ఆమెను డబ్బు కోసం మనీ మిషన్ లా వాడుకున్నాడు'' అని చెప్పింది.
''అందరూ చిరంజీవి - పవన్ కళ్యాణ్ లు ఏమైనా డోనేట్ చేసారని ప్రశ్నించే వారందరూ.. తండ్రులు సంపాదించిన ఆస్తులున్న నాగార్జున - వెంకటేష్ - బాలకృష్ణ ఏమైనా డోనేట్ చేసారా అని అడగరు. అంత ఆస్తి ఉన్నా సమంత ఒక రోబోట్ లాగా పని చేసింది. తల్లి అవ్వాలనే ఆశను కూడా చంపేసుకొని మనీ సంపాదించే మిషన్ లా పని చేసింది. అలా ఎన్ని రోజులని ఉంటుంది. అందుకే దయచేసి సామ్ మీద నెగెటివ్ కామెంట్స్ చేయొద్దు. అన్ని కోట్లు సంపాదించినా ఆమె కేవలం వేలల్లో పాకెట్ మనీ అడుక్కుని తీసుకుంటుంది? దానితోనే బ్రతకాలి. అలాంటి బ్రతుకు బతకడం కంటే ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి చూసుకోవడం చాలా మంచిది''
''ఎలాగూ తల్లి అవ్వాలన్న ఆశను నెరవేర్చుకోనివ్వలేదు. కనీసం తను సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టడానికి కూడా ఆమెను అనుమతించలేదు. అందుకే తెర మీదకు వచ్చి ఎక్కువ మాట్లాడే వాళ్ళు బ్యాడ్ అని.. తెర మీదకొచ్చి తక్కువ మాట్లాడే వారు గుడ్ అని అనుకోకండి. సమంత మీద చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఆమె చాలా స్వీట్ హార్ట్ పర్సన్. రూపాయి బయటకు తీయాలనే ఆలోచన లేని ఫ్యామిలీ నుంచి సమంత బయటకు వచ్చి ఆమె కోరుకున్నట్లు బ్రతుకుతుందని అనుకుంటున్నాను. ఇది నా ఇమేజిషన్ కాదు. నాకు 100 పర్సెంట్ తెలుసు కాబట్టి చెబుతున్నా. ఆ అమ్మాయిని డబ్బులు సంపాదించే మిషన్ లాగా వాడుకుంటున్నారంటే ఆమె విడాకులు తీసుకువడం బెటర్'' అని మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేసింది.