Begin typing your search above and press return to search.

తమిళ్ సినిమాకు దక్కిన గౌరవం

By:  Tupaki Desk   |   28 Sept 2017 10:57 AM IST
తమిళ్ సినిమాకు దక్కిన గౌరవం
X
కొన్ని సినిమాలల్లో ఎటువంటి భారీ తారాగణం లీకపోయినా ఊహించని విజయాల్ని అందుకుంటాయి. మార్కెట్ లేనటువంటి సహచర నటులు నటించిన చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వాయుళ్లను రాబడతాయి. ఒక సినిమాకు కావాల్సింది ఇదేనని అనేలా ఆ చిత్రాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. అదే తరహాలో విక్రమ్ వేధా అనే తమిళ్ సినిమా ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.

కేవలం 11 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్ల బాక్స్ ఆఫీసును అందుకొని ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పరభాషా ప్రముఖులను కూడా ఆకర్షించింది. కొందరైతే రీమేక్ చెయ్యడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. మాధవన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించగా పుష్కర్ అండ్ గాయత్రీ సినిమాను తెరకెక్కించారు.

ఇక అసలు విషయానికి వస్తే సినిమాకు ఒక అరుదైన గౌరవం దక్కింది. టోక్యో ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఫెస్టివల్ లో భాగంగా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జులైలో తమిళ్ భాషలో రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ వరకు 3 వరకు టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్ జరగనున్నాయి.