Begin typing your search above and press return to search.

మాధవన్ కొడుకుపై ప్రశంసల వెల్లువ

By:  Tupaki Desk   |   17 April 2022 3:13 PM IST
మాధవన్ కొడుకుపై ప్రశంసల వెల్లువ
X
డాక్టర్ కొడుకు డాక్టర్..యాక్టర్ కొడుకు యాక్టర్ కావడాన్ని మనం చూసి ఉంటాం. ఇతర రంగాల్లోకి వెళితే వారిని వింతగా చూస్తాం.. లగ్జరీల్లో పెరిగిన వారంతా తండ్రుల వారసత్వంలోనే ముందుకు వెళుతుంటారు. అయితే కొందరు చెడ ఆవాసాలతో చెడ్డ పేరు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. బాలీవుడ్ అగ్రహీరోల వారసులు ఇప్పటికే డ్రగ్స్ సహా పలు కేసుల్లో చిక్కుకొని చెడ్డ పేరు తెచ్చుకున్నారు.

అయితే తమిళ హీరో మాధవన్ కొడుకు మాత్రం సినీ రంగంలో కాకుండా మరో రంగంలోకి సత్తా చాటుతున్నాడు. అతడి ప్రతిభకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రెటీల వారసులు ఇలా ఉండాలంటూ మాధవన్ కొడుకు వేధాంత్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. మాధవన్ తన కొడుకును ఎంత పద్ధతిగా పెంచాడంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు.

తాజాగా మాధవన్ కొడుకు వేధాంత్ మరోసారి దేశానికి సిల్వర్ పతాకాన్ని సాధించాడు. డేనిష్ ఓపెన్ 2022లో మాధవన్ కొడుకు వేధాంత్ కు వెండి పతకం లభించింది. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించాడు.

మాధవన్ తన కొడుకు ఫొటోను మాత్రమే కాకుండా మొదట వచ్చిన బంగారు పతకం సాధించిన వ్యక్తి ఫొటో కూడా షేర్ చేసి అభినందించాడు. భారతదేశానికి సాజన్ ప్రకాష్ బంగారు పతకాన్ని, వేదాంత్ మాధవన్ సిల్వర్ పతాకాన్ని సాధించారని గర్వంగా చెప్పుకొచ్చాడు.

ఇక ఈ నేపథ్యంలోనే గురువైన ప్రదీప్ కు థ్యాంక్స్ చెప్పాడు  మాధవన్. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా మాధవన్ థ్యాంక్స్ చెప్పేశాడు. ఇలా మాధవన్ పెట్టిన ట్వీట్ కు జనాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. మాధవన్ ను, అతడి కొడుకును ఆకాశానికెత్తేస్తున్నారు.

వారసులు అంటే ఇలా ఉండాలని.. కొడుకు ఇష్టాన్ని గౌరవిస్తూ ప్రోత్సహిస్తున్న మాధవన్ మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.