Begin typing your search above and press return to search.

ఆ అద్బుతం జుట్టుకు వేసుకున్న రంగుది.. స్టార్‌ హీరో ఫన్‌

By:  Tupaki Desk   |   10 Nov 2020 1:30 AM GMT
ఆ అద్బుతం జుట్టుకు వేసుకున్న రంగుది.. స్టార్‌ హీరో ఫన్‌
X
సౌత్‌ స్టార్‌ హీరో మాధవన్‌ పై రెండున్న దశాబ్దాలు అయినా కూడా సౌత్‌ ఆడియన్స్‌ లో క్రేజ్‌ తగ్గలేదు. ఎన్నో రొమాంటిక్‌ సినిమాల్లో నటించి మెప్పించిన మాధవన్‌ ఇంకా కూడా హీరోగానే కొనసాగుతున్నాడు. 50 ఏళ్ల వయసులో కూడా మాధవన్‌ తన ఛార్మింగ్‌ తో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈయన సౌత్‌ లో పలు సినిమాల్లో నటిస్తున్నాడు. చాలా కాలం తర్వాత తెలుగులో కూడా ఈయన నిశబ్దం సినిమాలో నటించాడు. సినిమా నిరాశ పర్చినా కూడా తెలుగు ప్రేక్షకుల ఆధరణ దక్కించుకున్నాడు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే మాదవన్‌ ఒక అభిమాని చేసిన కామెంట్‌ కు చాలా ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.

మాధవన్‌ ఒక లెటెస్ట్‌ ఫొటోను షేర్‌ చేసిన అభిమాని రోజులు గడుస్తున్నాయి కాని మాధవన్‌ గారి వయసు మాత్రం తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన వయసు పెరగడం లేదు ఏంటో అంటూ ట్వీట్‌ చేయగా దానికి సమాధానంగా ఆ అద్బుతంకు కారణం నా జుట్టుకు వేసుకున్న రంగు అంటూ తనపై తానే కామెంట్‌ చేసుకున్నాడు. ఇలాంటి సెన్సాఫ్‌ హ్యూమర్‌ తమపై తామే పంచ్‌ లు వేసుకునే గుణం కొందరు స్టార్‌ లకు మాత్రమే ఉంటుందని అది మాధవన్‌ కు ఉంది అంటూ ఆయన అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.